ఏఎంసీ డైరెక్టర్ చిలుకు కిష్టయ్య
నవతెలంగాణ – ఆలేరు రూరల్
రైతులు దళారుల వలలో చిక్కుకొని మోసపోవద్దని,ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే పంటను విక్రయించాలని ఏఎంసీ డైరెక్టర్ చిలుకు కిష్టయ్య అన్నారు. గురువారం ఆలేరు మండలం శారాజిపేట గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి క్వింటాల్ వరికి రూ. 2389 మద్దతు ధరను నిర్ధారించిందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని,నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పంటను అమ్మితేనే లాభపడతారు అన్నారు.
రైతులు మధ్యవర్తులను ఆశ్రయించకుండా,ప్రభుత్వ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏపీఎం కవిత, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్, మండల ఏపీఎం సత్యనారాయణ, ఏఈఓ భార్గవి, మాజీ సర్పంచ్ బండి పర్వతాలు, మాజీ ఎంపీటీసీ బత్తుల నరేందర్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు కంతి నాగరాజ్, లలితా, శ్రీశైలం,మల్లేష్, ఉదయ్, నాగరాజు, స్వామి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.