Saturday, March 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొనుగోలు కేంద్రాల్లోనే పంటను అమ్ముకోవాలి: ఎఫ్పిఓ చైర్మన్ గోపాల్

కొనుగోలు కేంద్రాల్లోనే పంటను అమ్ముకోవాలి: ఎఫ్పిఓ చైర్మన్ గోపాల్

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
ఎర్రకందులైనా.. తెల్ల కందులైనా మద్దతు ధర కేంద్రాల్లోనే పంటను అమ్ముకోవాలని ఎఫ్పిఓ చైర్మన్ గోపాల్ రైతులకు సూచించారు. శుక్రవారం మద్నూర్ మార్కెట్ యార్డును ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్సిసిఎఫ్ ద్వారా మద్నూర్ ఎఫ్సిఓ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మద్దతు ధర కేంద్రంలో కంది పంటను అమ్ముకుని క్వింటాలుకు రూ.8000 మద్దతు ధర పొందాలని సూచించారు.

దళారులకు అమ్ముకుంటే క్వింటాలకు రూ.300 నుండి రూ.500 నష్టపోయే ప్రమాదం ఉందని రైతులకు ఆయన అవగాహన కల్పించారు. దళారులు ఎర్రకందులకు రూ.7800 లేదా రూ.7700 చొప్పున కొనుగోలు చేసుకుంటున్నారని తెలిపారు. దీనివల్ల రైతులు భారీగా నష్టపోతారని చెప్పారు. కావును ఎర్ర కందులైనా.. తెల్ల కందులైనా ప్రతి రైతూ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకుని లాభపడాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -