Friday, October 31, 2025
E-PAPER
Homeజిల్లాలుచేతికొచ్చిన పంట నీటిపాలు.. దిక్కుతోచని స్థితిలో రైతులు: సీపీఐ(ఎం)

చేతికొచ్చిన పంట నీటిపాలు.. దిక్కుతోచని స్థితిలో రైతులు: సీపీఐ(ఎం)

- Advertisement -

నవతెలంగాణ – తుంగతుర్తి
ఆరుకాలం కష్టం చేసి తీరా చేతికందే సమయంలో అకాల వర్షాలతో పంట మొత్తం నీటిలో మునగడం వలన రైతులు తీవ్రమైన నిరాశతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారని ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండల పరిధిలోని అన్నారం గ్రామంలో నష్టపోయిన పంటను పరిశీలించి తదనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు ఇప్పటికే నెల రోజుల నుండి వరి పంటను కోసి ఐకెపి సెంటర్లో ఆరబోసిన ధాన్యం తడిసి మొలకెత్తింది. కొనుగోలు కేంద్రాలను ఏర్పర్చిన కాంటాలు వేయకపోవడంతో పంట మొత్తం నాశనమయ్యే పరిస్థితి ఏర్పడిందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తేమతో సంబంధం లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని అన్నారు.

కోతకు వచ్చిన పంట మొదట వర్షాల వలన మొత్తం కిందపడి నీళ్లలో మునిగిపోవడం చేత పంట అపారమైన నష్టం జరిగిందని అధికారులు సర్వే చేసి నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.40 వేల అందించి రైతులను ఆదుకోవాలని కోరారు. ఐకెపి సెంటర్లు తగిన వసతులు లేకపోవడం ఆరబెట్టే అంత స్థలం లేకపోవడం పంట ఇంకా మొలకొచ్చే పరిస్థితులు ఉన్నందున వెంటనే ఐకెపి సెంటర్లో ఉన్న ధాన్యాన్ని కాంటాలు పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో  రైతు సంఘం జిల్లా నాయకుడు పల్లా సుదర్శన్, శాఖ కార్యదర్శి బాలబిందెల జానయ్య,బాలయ్య, బత్తుల వెంకటయ్య,లింగయ్య,,రాములు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -