తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
లాయర్ స్వప్న కుటుంబ సభ్యులకు పరామర్శ
నవతెలంగాణ-మొయినాబాద్
అన్న చేతిలో హత్యకు గురైన లాయర్ స్వప్న కేసు నిందితులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత ప్రభుత్వాన్ని కోరారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామంలో గురు వారం స్వప్న కుటుంబసభ్యులను ఆమె పరామర్శించి, సానుభూతిని తెలిపారు. తల్లికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువ న్యాయవాది స్వప్నను ఆస్తి కోసం తోడబుట్టిన అన్ననే చంపడం చాలా బాధాకరమన్నారు. స్వప్న కుటుంబానికి అండగా ఉంటానని తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆమె వెంట గ్రామ సర్పంచ్ గొడుగు యాదయ్య, ఉప సర్పంచ్ గోటూరి అనిత తదితరులు ఉన్నారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



