– కోనుగోలు కేంద్రాల్లో టర్ఫలిన్ లు ఎక్కడ ?
– తడిసిన ధాన్యాన్ని రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలి ః
– మిన్న కుండి పోతున్న సహకార సొసైటీలు, ఐకెపి కేంద్రాలు..
నవతెలంగాణ – డిచ్ పల్లి
తడిసిన ధాన్యాన్ని రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. డిచ్ పల్లి మండలంలోని సుద్దపల్లి, మెంట్రజ్ పల్లి, ఇందల్ వాయి సహకార సొసైటీ, డిచ్ పల్లి, ఇందల్ వాయి ఐకెపి పరిధిలోని ఆయా గ్రామాల్లో మంగళవారం కురిసిన వర్షానికి పూర్తిగా వరి ధాన్యం తడిసి ముద్దాయింది. తడిసిన ధాన్యాన్ని 500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి వేడు కుంటున్నామని రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. రాబోవు ఈ రెండు మూడు రోజుల పాటు తుఫాన్ వర్షం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుందని, కానీ ఇప్పటికీ కొనుగోలు కేంద్రంలో సరైన సదుపాయాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొంటున్న అధికారులు, వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న రైతుల కోసం ఇలాంటి పకడ్బందీ చర్యలు చేపట్టడం లేదని, కొనుగోలు కేంద్రాల్లో కుప్పలుగా వేసుకున్న వరి ధాన్యాన్ని రైతులే తర్ఫలిన్ తప్పుకోవాలని లేకపోతె చేసింది ఏమీ లేదని వారు పేర్కొంటున్నట్లు రైతులు వివరించారు. ఒక పక్క జిల్లా స్థాయి అధికారులు అన్ని సహకార సొసైటీలు ఐకెపి కేంద్రాల్లో తార్ఫలిన్లు అందుబాటులో ఉంచాలని ఆదేశిస్తున్న అధికారులు మిన్న కుండి పోవడంతో తమ్ముడు ఆరు కాలం కష్టించిన పంట చేతికి వచ్చిన తర్వాత నష్టం చెవి చూడవలసి వస్తుందని వారన్నారు.
కొన్ని సహకార సొసైటీలో మాత్రం కొనుగోలు చేసి పంపిస్తే తమ పని అయిపోయిందని అనుకుంటున్నారని కానీ కనీస సౌకర్యాలు కల్పించడంలో ఘోరంగా విఫలం చెందినట్లు రైతుల ఆరోపిస్తున్నారు.వెంటనే తార్పిన్ కవర్ లను రైతులకు అందించాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు.. తడిసిపోయిన ధాన్యం చూసి రైతులు కంటతడి పెడుతున్నారు. ఇకనైనా వెళ్లొస్తే అధికారులు పట్టించుకోని సహకార సొసైటీలు ఐకేపి కేంద్రాల్లో కేంద్రాలకు వచ్చిన వారి ధాన్యాన్ని కాపాడడానికి టార్ఫలిన్ లను అందుబాటులో ఉంచి నాణ్యం తడిసి ముద్ద కాకుండా చూడవలసిన బాధ్యత ఎంతైనా ఉందని వారన్నారు. ఇందల్వాయి సహకార సొసైటీ పరిధిలోని గిరిజన తండాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో వర్షంతో వడ్లు నాని ధారగా కొట్టుకుపోయినట్లు గిరిజనులు వాపోయారు. సొసైటీకి చెప్పిన ఏమి చేయాలేని పరిస్థితి ఉందని రైతులు పేర్కొంటున్నారు.




