Monday, March 30, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగోవా శిఖరాగ్రాన తెలంగాణ గిరిజన బిడ్డ సాహసం

గోవా శిఖరాగ్రాన తెలంగాణ గిరిజన బిడ్డ సాహసం

- Advertisement -

– సోన్సోగోర్‌ పర్వతంపై త్రివర్ణ పతాకం ఎగురవేసిన యశ్వంత్‌ నాయక్‌
నవతెలంగాణ – మరిపెడ

తెలంగాణ గిరిజన యువకుడు, పర్వతారోహకుడు భూక్య యశ్వంత్‌ నాయక్‌ మరో అరుదైన ఘనత సాధించారు. గోవాలోని అత్యంత ఎత్తయిన సోన్సోగోర్‌ (1,166 మీటర్లు) పర్వతాన్ని అధిరోహించి, శిఖరాగ్రాన భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ‘హర్‌ శిఖర్‌ పర్‌ తిరంగా’ జాతీయ యాత్రలో భాగంగా శనివారం తన బృందంతో కలిసి ఈ విజయాన్ని అందుకున్నారు. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం భూక్యా తండాకు చెందిన రామ్మూర్తి నాయక్‌, జ్యోతి దంపతుల కుమారుడైన యశ్వంత్‌, దేశంలోని 28 రాష్ట్రాల ఎత్తయిన శిఖరాలను అధిరోహించడమే లక్ష్యంగా ఈ యాత్ర చేపట్టారు. ఇప్పటికే అరుణాచల్‌ ప్రదేశ్‌ (గోరిచెన్‌), మణిపూర్‌ (మౌంట్‌ ఐసో), మిజోరం (ఫాంగ్‌పుయి), రాజస్థాన్‌ (గురు శిఖర్‌), ఆంధ్రప్రదేశ్‌ (అర్మకొండ)లోని పలు శిఖరాలను ఆయన అధిరోహించారు.

భయంకర అడవి.. వన్యప్రాణుల మధ్య ప్రయాణం
ఈ సందర్భంగా యశ్వంత్‌ నాయక్‌ మాట్లాడుతూ.. మార్చి 28న ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ యాత్ర రాత్రి 11 గంటలకు ముగిసిందని తెలిపారు. దట్టమైన అటవీ ప్రాంతం, క్రూర మృగాల సంచారం మధ్య సరైన దారి లేకపోయినా పట్టుదలతో శిఖరాన్ని చేరుకున్నట్టు వివరించారు. ఈ యాత్రకు సహకరించిన గోవా డీజీపీ అలోక్‌ కుమార్‌, పీసీసీఎఫ్‌ కమల్‌ దత్తా, డీసీఎఫ్‌ జిస్‌ వెర్కీకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బృంద సభ్యులు గణబా గోవింద్‌ గాంకర్‌, దీలీప్‌ కిర్కర్‌, రాజు దోయిఫుడే, నాయుడు గావకర్‌, జాన్‌రిచ్‌ ఫెర్నాండెజ్‌, ఉజ్వల్‌, రెహాన్‌ షేక్‌ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -