- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
డీఈఈసెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 15 వరకు గడువు ఉన్నట్టు టీజీ డీఈఈసెట్ – 2026 కన్వీనర్ జి.రమేశ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు మొత్తం 20,705 దరఖాస్తులు రాగా, అందులో తెలుగు మీడియం కోసం 7,543, ఇంగ్లీష్ మీడియం కోసం 12,256, ఉర్దూ మీడియం కోసం 906 మంది దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు. ఏప్రిల్ 17, 18 తేదీల్లో అప్లికేషన్లను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించినట్టు తెలిపారు. అభ్యర్థులు సహాయం కోసం అన్ని పని దినాల్లో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 83175 67404లో సంప్రదించవచ్చని తెలిపారు.
- Advertisement -



