Wednesday, March 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంచిన్నారి మరణాన్ని సాధారణంగా చిత్రీకరిస్తున్నారు

చిన్నారి మరణాన్ని సాధారణంగా చిత్రీకరిస్తున్నారు

- Advertisement -

సమగ్ర విచారణ జరిపించాలి: ఎస్‌వీకే వెబినార్‌లో తెలంగాణ రజకవృత్తిదారుల సంఘం ప్రధాన కార్యదర్శి ఫైళ్ల ఆశయ్య
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

కుమ్మెర గ్రామంలో పెత్తందారుల దాడిలో పసిపాప మరణాన్ని సాధారణ మరణంగా చిత్రీకరి స్తున్నారని తెలంగాణ రజకవృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హోంమంత్రిగా కూడా ఉన్నారనీ, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ‘పసిపాప హంతకులపై చర్చకు ప్రభుత్వం వెనకాడుతోందా? అనే అంశంపై వెబినార్‌ నిర్వహించింది. దీనికి ఎస్‌వీకే మేనేజింగ్‌ కమిటీ కార్యదర్శి ఎస్‌ వినయకుమార్‌ సమన్వకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆశయ్య మాట్లాడుతూ రజక కుటుంబంపై కుమ్మెర గ్రామం లో కులదురహంకార దాడి జరిగిందన్నారు. దాడిలో రెండు నెలల పసిపాప రక్త ప్రసరణ ఆగిపోవడంతో చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీ, పోలీసులు, ప్రభుత్వ పెద్దలు కలిసి సాధారణ మరణంగా చిత్రికరించి, పెత్తందారులను రక్షించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మల్లన్న జాతర సందర్భంగా దైవ దర్శనానికి వెళ్లిన రజకవృత్తిదారుల కుటుంబం …వంద రూపాయలు చెల్లించి దర్శనానికి వెళ్లాలని డిమాండ్‌ చేశారని తెలిపారు. వందలకు రసీదు ఇస్తారా? అంటూ ఆ కుటుంబం ప్రశించడంతో వారిని కులంపేరిట దూషించడంతోపాటు భౌతికదాడికి పాల్పపడ్డారని విమర్శించారు. గణేష్‌ కుటుంబ సభ్యులను గుడిలోకి రాకుండా నెట్టేశారని తెలిపారు. తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ తన వాట్సాఫ్‌లో గణేష్‌ పోస్టు పెట్టడాన్ని జీర్ణించుకోలేని పెత్తందారులు శ్రీనివాసరెడ్డి, సతీష్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, కన్నారెడ్డి, మధుసుధన్‌రెడ్డి తదితరులు ఆయన్ను బంధించి ముక్ముడిగా దాడి చేశారని తెలిపారు. దాడికి అడ్డంగా నిలబడ్డ భార్యను, ఆమె ఒడిలో ఉన్న పసిపాపపై విచక్షణారహితంగా వారు దాడికి పాల్పడ్డారని తెలిపారు. దీంతో పాసిపాప ఆగి చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దాడిలో ఎనిమిది పాల్గొంటే, ముగ్గుర్ని అరెస్టు చేశారని, మిగతా వారిని అరెస్టు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చెప్పారు. వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. స్థానిక ఎమ్మెల్యేకు, ముఖ్యమంత్రికి పెత్తందారులతో బంధుత్వం ఉండటంతో వారిని అరెస్టు చేయడం లేదని విమర్శించారు. బీసీ కమిషన్‌ కూడా కేవలం పోలీసులు ఇచ్చిన సమాచారంతో మాట్లాడటం సరైందికాదన్నారు. బాధితులను కలవకుండా ఏకపక్ష వాదనలు విని బాధితులనే తప్పుపడుతున్నారని విమర్శించారు. షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్‌ది కుమ్మెర గ్రామమా? అని ప్రశ్నించారు. అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి కోటి రూపాయలు, ఇల్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డీఎస్సీ, సీఐ, ఎస్సైలను సస్పెండ్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -