సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి
నవతెలంగాణ – నూతనకల్
స్వతంత్ర సమరయోధులు మాజీ జెడ్పిటిసి కామ్రేడ్ తోట్ల మల్సూర్ సతీమణి సీపీఐ(ఎం) సీనియర్ నాయకురాలు తొట్ల మల్లమ్మ మృతి శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందింది. శనివారం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి లు మృతురాలి మృతదేహం పై పార్టీ జెండా కప్పి పుష్పగుచ్చం నుంచి శ్రద్ధాంజలి ఘటించారు. మృతురాలికి సంతాపం తెలిపి మృతురాలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కామ్రేడ్ మల్లమ్మ మృతి గ్రామంలో సీపీఐ(ఎం) పార్టీకి తీరని లోటు అని అన్నారు. నాటి నిజాం సర్కార్కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి , మల్లు స్వరాజ్యం, లకు అనుచరులుగా పనిచేసిన చేస్తున్న సందర్భంలో తన భర్త మల్సూర్ కు తోడుగా అనేక పోరాటాలలో నేనున్నానంటూ భరోసా కల్పించి అనేక పోరాటాలలో ముందుండేది అని అన్నారు.
ఆయన అనేక పోరాటాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొత్తం తిరుగుతున్న సమయంలో కూడా తన కుటుంబ సభ్యులను, తన ఇద్దరు కుమారులను వ్యవసాయ కూలి చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకునేది భర్త అడుగుజాడల్లో నడుస్తూ కూలిరెట్ల పెంపు కోసం కోలాటం, ఉయ్యాలా వంటి పాటలు పాడుకుంటూ మహిళల చైతన్యవంతం చేసేదని గుర్తు చేశారు. ఆమె నాటి మహిళా సంఘం నాయకురాలు అయిన కామ్రేడ్ మల్లు స్వరాజ్యం సూర్యావతి మోటూరు ఉదయం లకు సహచరులుగా పనిచేస్తూ అనేక పోరాటాలతో పాల్గొన్నారు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సారా వ్యతిరేక ఉద్యమంలోను , మహిళల హక్కుల సాధన కోసం అనేక పోరాటాలలో ముందుండేదనీ అన్నారు.
నాడు ఎర్ర పహాడ్ దేశ్ముఖ్ జన్నారెడ్డి ప్రతాపరెడ్డి దొరలకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో కూడా గ్రామంలో ప్రజలకు అండగా అంటూ లేక పోరాటాలు చేసిందని అన్నారు. గ్రామంలో పార్టీ బలోపేతం కోసం అనునిత్యం కృషి చేస్తూ నాటినుండి నేటి వరకు జరిగిన ప్రతి ఎన్నికలలో కూడా గెలుపు కోసం తన బాధ్యతగా ఎన్నికల ప్రచారం చేసేదని అన్నారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో కూడా తమ ఓటు హక్కులు వినియోగించుకుందని ఆ ఎన్నికలలో కూడా సిపిఐ బలపరిచిన అభ్యర్థి గెలవడం అభినందనీయమని తెలిపారు.
మృతురాలికి సంతాపం తెలిపిన వారిలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొరిశెట్టి యాదగిరిరావు జిల్లా కమిటీ సభ్యులు పులుసు సత్యం బూర శ్రీనివాస్ మండల కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి గ్రామ సర్పంచ్ అంజపెళ్లి నరసమ్మ లక్ష్మయ్య, గీత కార్మిక సంఘం జిల్లా నాయకులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు అబ్బ గాని బిక్షం బత్తుల జనార్ధన్ గౌడ్ సీపీఐ(ఎం) మండల కమిటీ గ్రామ శాఖల కార్యదర్శిలు సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.



