- Advertisement -
జేడీఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ పట్టణంలో సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి అన్నారు. సమాజంలో నేరాలను అరికట్టేందుకు పోలీసులు నిరంతరం డ్యూటీలో కష్టపడుతూ ప్రజలందరిని కాపాడుతున్నారని గుర్తు చేశారు.ఘటన సమయంలో అక్కడున్న ప్రజలు స్పందించకపోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి పౌరుడు సమాజంలో బాధ్యత కలిగి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని మృతి చెందిన కానిస్టేబుల్ ప్రమోద్ కు సంతాపాన్ని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వాసు వడ్లూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
- Advertisement -