Sunday, September 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కా. సురవరం సుధాకర్ రెడ్డి మరణం పేదలకు తీరని లోటు

కా. సురవరం సుధాకర్ రెడ్డి మరణం పేదలకు తీరని లోటు

- Advertisement -

తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా అధ్యక్షులు మొసలి శ్యాంప్రసాద్ రెడ్డి
నవతెలంగాణ – తిమ్మాజిపేట

సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మరణం పేదలకు బహుజనులకు ప్రజా పోరాటాలు ఊపిరిగా బ్రతికే వాళ్లకు తీరని లోటని తెలంగాణ జన సమితి పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు మొసలి శ్యాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం హైదరాబాదులోని ముద్దం భవన్ లో ఆయన పార్తివదేహానికి నివాళులు అర్పించారు. సురవరం సుధాకర్ రెడ్డి పాలమూరు గడ్డపై పుట్టి విద్యార్థి దశ నుంచి పోరాటపాటిమతో జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారని తెలిపారు. పార్లమెంటు సభ్యుడిగా ప్రజలకు సేవచేస్తూ పదవి ఉన్నా లేకున్నా.. నిరంతరం నమ్ముకున్న సిద్ధాంతం కోసం పేదల తరఫున నిలబడుతూ ప్రజా ప్రతినిధిగా సేవలందించాడని అన్నారు. ఎక్కడ కూడా అహంభావం ప్రదర్శించకుండా నిడంబర మనిషిగా తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించిన వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి అని, తన చివరి శ్వాస వరకు ప్రజల కోసం పోరాటం చేశాడని గొప్ప మహానుభావుడని తెలిపారు. ఆయన మరణం కమ్యూనిస్టులకే కాకుండా యావత్తు తెలంగాణ సమాజానికి తీరని లోటని ఆయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -