Sunday, May 25, 2025
Homeతెలంగాణ రౌండప్పెద్దిశృతి ముదిరాజ్  మరణం బాధాకరం

పెద్దిశృతి ముదిరాజ్  మరణం బాధాకరం

- Advertisement -

యువత క్షణికావేశంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు
యువత చదువులో పాస్ కావడం ముఖ్యం కాదు.. జీవితంలో పాస్ కావలి
పులి దేవేందర్ ముదిరాజ్
మెపా వ్యవస్థాపక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్ 
నవతెలంగాణ – తాడ్వాయి
: ఇంటర్ విద్యార్థిని పెద్ది శృతి ముదిరాజ్ మరణం బాధాకరం అని, యువత క్షణికా విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని మెపా వ్యవస్థాపక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఇందిరానగర్ చేరుకొని క్షణికావేశంలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న పెద్ది శృతి ముదిరాజ్ కుటుంబాన్ని పరామర్శించి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతి యువత క్షణికావేశంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోని, కన్న తల్లిదండ్రులకు గర్భ శోకం తీసుకురవద్దని, మంచి ఉన్నత విద్యాభ్యసించి భవిష్యత్తులో ఉన్నతమైన స్థాయిలో ఉంటూ తల్లిదండ్రుల ఆశయాలను నేరవేర్చి, సమాజానికి ఆదర్శంగా ఉండాలని ఆయన అన్నారు. యువత చదువులో పాస్ కావడం ముఖ్యం కాదు అని, జీవితంలో పాస్ కావలి అని తెలిపారు. అనంతరం మెపా ములుగు జిల్లా అధ్యక్షులు అచ్చునూరి కిషన్ ముదిరాజ్ మాట్లాడుతూ…..ముదిరాజ్ బిడ్డలు మెపా ను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని విద్య, ఉద్యోగ, సాధికారత కోసం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో  మెపా రాష్ట్ర కార్యదర్శి దండు చిరంజీవి ముదిరాజ్, సింగారపు రామకృష్ణ ముదిరాజ్, వరంగల్ జిల్లా అధ్యక్షులు తాళ్ళ రవీందర్ ముదిరాజ్, ములుగు జిల్లా గౌరవ అధ్యక్షులు బండి రాజు ముదిరాజ్, వెంకటయ్య, ములుగు నియోజక వర్గం అధ్యక్షులు డ్యాగల సలేందర్, రాజేందర్, తాడ్వాయి కుల పెద్దలు కళ్లబోయిన భద్రయ్య, రంగరబోయిన జగదీష్ ముదిరాజ్, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -