Monday, January 19, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరాన్‌ ఆందోళనల్లో 5,000కు చేరిన మృతుల సంఖ్య

ఇరాన్‌ ఆందోళనల్లో 5,000కు చేరిన మృతుల సంఖ్య

- Advertisement -

వీరిలో 500 మంది భద్రతా సిబ్బంది కూడా..

టెహ్రాన్‌ : దేశవ్యాప్తంగా చేపడుతున్న హింసాత్మక ఆందోళనలతో మృతుల సంఖ్య 5,000కు చేరిందని ఇరాన్‌ అధికారి ఒకరు ఆదివారం తెలిపారు. మృతుల్లో సుమారు 500మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారని అన్నారు. అమాయక ఇరానియన్లు మరణించడానికి ఉగ్రవాదులు, సాయుద అల్లర్లు కారణమని తెలిపారు. వాయువ్య ఇరాన్‌లోని ఇరానియన్‌ కుర్దిష్‌ ప్రాంతాల్లో జరిగిన అత్యంత తీవ్రమైన ఘర్షణలు అత్యధిక మరణాలకు కారణమయ్యాయని చెప్పారు. ఈ ప్రాంతంలో కుర్దిష్‌ వేర్పాటువాదులు హింసాత్మక అల్లర్లను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఇజ్రాయిల్‌, విదేశాల్లో ఉన్న సాయుధ సమూహాలు ఆందోళన చేపడుతున్న వారికి ఆయుధాలు సమకూరుస్తున్నాయని సదరు అధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -