Thursday, January 15, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంట్రాఫిక్‌ చలాన్‌లపై నిర్ణయాన్ని పున:సమీక్షించాలి

ట్రాఫిక్‌ చలాన్‌లపై నిర్ణయాన్ని పున:సమీక్షించాలి

- Advertisement -

నేరుగా ఖాతా నుంచి కట్‌ చేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి..
లక్షలాది మంది ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదముంది : ముఖ్యమంత్రికి తెలంగాణ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ విజ్ఞప్తి
ఇష్టానుసారంగా చలాన్‌లు వేయడం సరికాదని విన్నపం
నవతెలంగాణ-సిటీబ్యూరో

రాష్ట్రంలో ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనల పేరుతో చలానా డబ్బులను వాహనదారుల బ్యాంక్‌ ఖాతాల నుంచి నేరుగా (ఆటో డేబిట్‌) కట్‌ చేయాలన్న నిర్ణయాన్ని తక్షణమే పున:సమీక్షించాలని తెలం గాణ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తూ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మంచిరెడ్డి రాజేందర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తాము స్వాగతిస్తున్నా మని తెలిపారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలకు తమ పూర్తి సహకారం ఉంటుందని స్పష్టంచేశారు. అయితే, చలానాల పేరుతో నేరుగా ఖాతాల నుంచి డబ్బులు కట్‌ చేయడం వల్ల రవా ణా రంగంపై ఆధారపడిన లక్షలాది మంది కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందు ల్లోకి వెళ్తారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆటోలు, క్యాబ్‌లు, లారీలు, బస్సు లు నడుపుకునే వారితోపాటు, వాహనా లపై చిన్న చిన్న వస్తువులు అమ్ముకునే వారు ఇప్పటికే తక్కువ ఆదాయం, పెరి గిన ఖర్చులతో సతమత మవుతున్నారని తెలిపారు. నెలంతా కష్టపడి సంపాదించిన డబ్బును ఈఎంఐ లు, కుటుంబ ఖర్చులు, వైద్య అవసరాల కోసం బ్యాంకులో జమ చేసుకుంటున్నారని, ఇప్పుడు చలా నాల పేరుతో ఆ డబ్బును కట్‌ చేస్తే.. చెక్కులు బౌన్స్‌ అయ్యి, సిబిల్‌ స్కోర్‌ దెబ్బ తిని వ్యాపారాలు మూతపడే ప్రమాదం ఉందన్నారు. పార్కింగ్‌ సదుపాయాలు కల్పించకుండానే నో పార్కింగ్‌ చలానాలు వేయడం, చిన్నపాటి వేగ పరి మితి దాటినా, చెట్ల చాటు నుంచి ఫొటోలు తీసి ఇష్టాను సారంగా చలానాలు విధించడం సరి కాదన్నారు. అత్యవసర వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లే సమ యంలో ఖాతాలో ఉన్న కనీస మొత్తాన్ని చలాన్‌ కింద కట్‌ చేస్తే ఆ కుటుంబాల పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రవాణా రంగాన్ని ఆదు కోవాల్సిన ప్రభుత్వమే ఇలాంటి నిర్ణయాలతో కార్మికులను కుంగదీయకూడదని చెప్పారు. సీఎం వెంటనే స్పందించి, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకో వాలని, రవాణా రంగ సమస్యలపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -