Saturday, July 19, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ముదురుతున్న వివాదం…బీఆర్ఎస్‌పై కవిత సంచలన వ్యాఖ్యలు

ముదురుతున్న వివాదం…బీఆర్ఎస్‌పై కవిత సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తీన్మార్‌ మల్లన్న వ్యాఖ్యలపై భారత రాష్ట్ర సమితి నేతలు స్పందించలేదని ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత అన్నారు. దీన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పారు. ‘బీఆర్ఎస్ నేతలు నా దారికి రావాల్సిందే. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే బీసీ రిజర్వేషన్‌ ఆర్డినెన్స్‌ నిర్ణయాన్ని సమర్థించా. రెండు బిల్లులు పెట్టాలని మొదట డిమాండ్‌ చేసింది కూడా నేనే.’’ అని కవిత అన్నారు.

ఇక తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కవిత మధ్య గ్యాప్ అంతకంతకూ పెరుగుతోంది. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవాధ్యక్షురాలిగా ఉన్న కవితను కేటీఆర్ తొల‌గించి ఆ సంఘం ఇన్ఛార్జిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కేటీఆర్ నియమించారు. ఈ నియమకం రాజకీయావర్గాల్లో చర్చకు తెర లేపింది. బీఆర్ఎస్ లో, ఆ పార్టీ అనుబంధ సంఘాల్లో కవిత ప్రాధాన్యతను తగ్గిస్తున్నారనే చర్చ జరుగుతోంది.

తన తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కవిత రాసిన లేఖ లీక్ అయిన సంగతి తెలిసిందే. ఆ లేఖలో పరోక్షంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ను కవిత విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తోంది. దీంతో బీఆర్ఎస్ నేత‌ల‌తో క‌విత వివాదం అంత‌కంత‌కు పెరుగుతొంది. మరోవైపు జాగృతి సంస్థను పటిష్టం చేసే పనిలో ఎమ్మెల్సీ కవిత ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -