Sunday, April 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవిద్యుత్‌ ఆర్టిజన్ల డిమాండ్లను పరిష్కరించాలి

విద్యుత్‌ ఆర్టిజన్ల డిమాండ్లను పరిష్కరించాలి

- Advertisement -

తక్షణమే జేఏసీతో చర్చలు జరపాలి
సమ్మెకు మద్దతిస్తున్నాం : సీపీఐ(ఎం)
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

తక్షణమే జేఏసీతో చర్చలు జరిపి విద్యుత్‌ ఆర్టిజన్ల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘రాష్ట్రంలోని విద్యుత్‌ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్‌ ఉద్యోగులు, అన్‌-మ్యాన్డ్‌ వర్కర్లు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు న్యాయమైన హక్కుల కోసం అనేకసార్లు నిరసనలు తెలిపినా యాజమాన్యాలు మొండిగా వ్యవహరిస్తున్నాయి. దీంతో తప్పని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ ఆర్టిజన్‌ ఎంప్లాయిస్‌ జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 8 నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. విద్యుత్‌ సరఫరా కోసం ప్రాణాలకు తెగించి పని చేస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది.

వారి పోరాటాలకు మద్దతును ప్రకటిస్తున్నది’ అని పేర్కొన్నారు. విద్యార్హతలను బట్టి ఆర్టిజన్లకు కేడర్‌ మార్పు చేపట్టాలనీ, 2019 స్టాండింగ్‌ ఆర్డర్స్‌ రద్దు చేసి, వెంటనే పాత ఏపీఎస్‌ఈబీ సర్వీస్‌ రూల్స్‌ వర్తింపజేయాలనీ, అన్‌మ్యాన్డ్‌ వర్కర్లను తక్షణమే ఆర్టిజన్లుగా గుర్తించి విలీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. 04-12-2016 కట్‌-ఆఫ్‌ తేదీ కంటే ముందు నుంచి పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులందరినీ, విజిలెన్స్‌ క్లియరెన్స్‌ ఉన్న వారిని బేషరతుగా విద్యుత్‌ సంస్థల్లోకి తీసుకోవాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టిజన్లకు 2026 పీఆర్‌సీని వెంటనే వర్తింపజేసి, పీస్‌ రేట్‌ కార్మికులకు జీవో నెంబర్‌ 11 ప్రకారం తక్షణమే కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. క్షేత్రస్థాయిలో విద్యుత్‌ ప్రమాదాల బారినపడి చేతులు, కాళ్లు కోల్పోయి వికలాంగులుగా మారుతున్న ఆర్టిజన్లకు రిస్క్‌ బెనిఫిట్స్‌ అందించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -