నవతెలంగాణ-కమ్మర్ పల్లి
ప్రజా ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేరుస్తుందని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృఢ నిశ్చయంతో పేదల కొరకు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. శనివారం వేల్పూర్ మండల కేంద్రంలోని బీసీ కాలనికి చెందిన గుండేటి భాగ్య భూమేశ్వర్ నూతనంగా పూర్తయిన ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమంలో ముత్యాల సునీల్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేరుస్తుందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో సొంత ఇల్లు లేని నిరుపేదలు ఉండకూడదున్న లక్ష్యంతో ముందుకు వెళుతూ.. పేదల కొరకు నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. నూతనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం చేసిన గుండేటి భాగ్య భూమేశ్వర్ కుటుంబ సభ్యులను ఆయన అభినందించారు. తమ సొంతింటి కలను నెరవేర్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సునీల్ రెడ్డిలకు లబ్ధిదారుని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



