Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ను తక్షణమే సస్పెండ్ చేయాలి 

మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ను తక్షణమే సస్పెండ్ చేయాలి 

- Advertisement -

ప్రజావాణిలో వినతి 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

రాజ్యాంగం రాసింది ఏవడు అని అనుచిత వ్యాఖ్యలు చేసిన నిజామాబాద్ మున్సిపల్ డిప్యూటీ కమీషనర్ రవిబాబు పై చర్యలు తీసుకొని తక్షణమే సస్పెండ్ చేయాలని బి ఎల్ టి యు రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్, బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ సబ్బని లతా డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణి లో జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమీషనర్, ఇన్చార్జ్ ఎంహెచ్ఓ అయినా  రవిబాబు కి ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలను నివేధించడానికి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ బిఎల్టియు ఆధ్వర్యంలో వెళ్లినప్పుడు ఇలాంటి పనికిరాని విషయాలు ఎందుకు మీకు, అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు.

అంతేకాదు ఔట్సోర్సింగ్ కార్మికులకు రాజ్యాంగం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించిన చట్టపరమైన హక్కులను మాత్రమే అడుగుతున్నాము అని అంటే రాజ్యాంగం రాసింది ఎవడు వాడు అంటూ రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిర్మాత అయినా డా॥ బాబాసాహెబ్ అంబేడ్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ కమీషనర్ రవిబాబుని తక్షణమే సస్పెండ్ చేసి శాఖపరమైనా చర్యలు తీసుకోవాలని తమ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఇతను గతంలో ఎమ్మెల్యే, మేయర్, కమీషనర్ పట్ల ఆమర్యాదగా ప్రవర్తించడం వల్ల నిజామాబాద్ నుంచి బదిలి చేయడం జర్గింది. ఆదిలాబాద్, నిర్మల్ కూడా విధి నిర్వహణలో ప్రజల పట్ల, ప్రజాప్రతినిధులు పట్ల అమర్యాదగా అసహనాన్ని వ్యక్తం చేయడంతో ప్రజలు నిరసన తెలపడంతో అక్కడి నుండి కూడా బదిలి చేశారని వివరించారు. ప్రస్తుతం నిజామాబాద్కు తాను కేవలం రెవెన్యూ సెక్షన్ చూడడానికి లక్షలాది రుపాయలు ఇచ్చి వచ్చాను చెప్పడం సరికాదన్నారు.

బి ఎల్ టి యు నాయకుల ముందు శానిటేషన్ ఇన్చార్జ్ ఇచ్చారని కార్మికుల ముందు, కమీషనర్ పై సైతం అనుచిత వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ కమీషనర్ రవిబాబు ఉద్యోగ బాధ్యతల్లో ఇతని చరిత్రంతా కార్మికుల పట్ల, అధికారుల పట్ల, ప్రజా ప్రతినిధుల పట్ల మర్యాదగా అనుచిత వ్యాఖ్యలు చేసినా చరిత్ర వున్నందున తక్షణమే ఉద్యోగ బాధ్యతల నుంచి తోలగించి, రాజ్యాంగ నిర్మాత పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినా డిప్యూటీ కమీషనర్ రవిబాబు కి విధుల నుంచి తోలగించి శాఖపరమైనా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఎల్ టీయూ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్, బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ సబ్బని లత, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, సీనియర్ నాయకులు జంగిటి విశ్వనాథ్,బహుజన లెఫ్ట్ మహిళా సంఘం నగర నాయకురాలు గాజుల రాధాలు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img