జీన్ బాప్టిస్ట్ సే అనే ఫ్రెంచి ఆర్థికవేత్త పద్దెనిమిదో శతాబ్దానికి చెందినవాడు. అతను ఒక సూత్రాన్ని ప్రతి పాదించాడు. ”సరుకుల సరఫరాయే దానికి సరిపడా డిమాండ్‌ను సృష్టిస్తుంది” అన్నదే ఆ సూత్రం. దాని ప్రకారం ఏ ఆర్థిక వ్యవస్థలోనైనా, మొత్తంగా ఉత్పత్తి అయ్యే సరుకులకు సరిపడా డిమాండ్ ఉండి తీరు తుంది. డిమాండ్ కొరత ఉండే ప్రసక్తే రాదు. ఈ సూత్రాన్ని సమర్ధిస్తూ అతడి వాదన ఇలా సాగింది:ఏ సరుకు ఎంత ఉత్పత్తి అవుతుందో దాని విలువకు సమా నంగా దాని ఉత్పత్తితో సంబంధం కలిగివున్నవారి ఆదా యాలు కూడా సమకూరుతాయి. ఈ ఆదా యాన్ని వారు ఖర్చు చేయనూవచ్చు లేదా దాచుకోవచ్చు (పొదుపు చేయ వచ్చు). ఏ మేరకు ఖర్చవుతుందో ఆ మేరకు ఆ సరుకులకు మళ్లీ డిమాండ్ ఏర్పడుతుంది. ఏ మేరకు దాచుకుంటారో, ఆ మేరకు దాచుకున్న సొమ్ముతో పెట్టుబడికి అవసరమయ్యే సరుకులనైనా కొంటారు లేదా పెట్టుబడి పెట్టేవారికి రుణాల రూపంలోనైనా ఇస్తారు. అంటే ఎంత మొత్తాన్ని దాచుకుంటారో దానికి సరి సమానంగా ధనం పెట్టుబడి రూపంలో మార్కెట్‌లోకి ప్రవేశి స్తుంది. ఆ రుణాల మీద వడ్డీ కూడా మార్కెట్‌లోకి ఖర్చు రూపం లోనో, పెట్టుబడి రూపంలోనో తిరిగి ప్రవేశిస్తుంది. అందు చేత పెట్టుబడిదారీ వ్యవస్థలో పూర్తిస్థాయిలో అందరికీ ఉపాధి కల్పించి తీరాల్సిన ఆగత్యం ఏమీ లేదు. ఉత్పత్తి అయిన సరుకుల విలువకు సమానంగా ఆదాయాలు కూడా సమకూరుతాయి కనుక సరుకుల డిమాండ్ అనేది తప్పకుండా ఉంటుంది. కొన్ని సరుకుల విషయంలో సప్లైకి డిమాండ్ సరిపోకపోవచ్చు. కాని మొత్తంగా ఆర్థిక వ్యవస్థను చూసిన ప్పుడు ఆ విధంగా ఉండదు. సప్లై ఎంత ఉంటుందో, డిమాండ్ కూడా అంతే ఉంటుంది.” – ఇదీ సే చేసిన వాదన.
సే సూత్రంతో ఒక సమస్య ఉంది. ప్రస్తుత కాలంలో ఎంత ఆదాయం సమకూరిందో ఆ ఆదాయమంతా ప్రస్తుత కాలంలో ఉత్పత్తి అయిన సరుకుల వినిమయం కోసమే ఖర్చు చేయబడు తుందని ఆ సూత్రం భావిస్తుంది. లేదా ఆ ఆదాయంలో కొంత భాగం దాచుకుంటే అలా దాచుకున్న మొత్తం కూడా ప్రస్తుత కాలంలోనే పెట్టుబడిగా తిరిగి మార్కెట్‌లోకి వస్తుందని భావి స్తుంది. అయితే ఆదాయాన్ని పొందినవారు దాన్ని డబ్బు రూపం లోనే దాచుకున్నప్పుడు ఏం జరుగుతుందన్నది సే సూత్రం వివ రించలేదు. అలా కొంతధనాన్ని దాచుకున్నప్పుడు మార్కెట్‌లోకి ప్రవేశించిన సరుకుల విలువకు సమానంగా డబ్బు మార్కెట్‌లోకి రాదు. అప్పుడు సప్లైకి సరిపడా డిమాండ్ ఉండదు. అటు వంటప్పుడు తగ్గిన డిమాండ్‌కు అనుగుణంగా సరుకుల ధరలను గనుక తగ్గిస్తే అప్పుడు డబ్బు విలువ పెరుగు తుంది. దాన్ని మరింత ఎక్కు వగా దాచుకోవాలన్న ట్రెండ్ పెరుగుతుంది.
పెట్టుబడిదారీ ఆర్థిక సిద్ధాంతాన్ని సమర్ధించే ఆర్థికవేత్తలు సే సూత్రాన్ని ఆమోది స్తారు. దాన్ని సమర్ధిస్తూ వారిలా వాదిస్తారు: పెట్టుబడిదారులు ఎప్పుడూ తమ సంపదను డబ్బు రూపంలో దాచుకోడానికి సిద్ధపడరు. డబ్బును వారు ఒక మారకపు సాధనంగానే పరి గణిస్తారు. అందుచేత సప్లై-డిమాండ్ సమ తూకానికి ఎటువంటి ఇబ్బందీ తలెత్తదు”. ఇది పూర్తిగా అర్ధం లేని వాదన. అంతే కాకుండా, అనుభవాన్ని చూసినా ఇది చెల్లదు. అసలు సే సూత్రమే పెట్టుబడిదారీ వ్యవస్థకు అతకని సూత్రం. కార్ల్‌మార్క్స్ అందుకే సే సూత్రాన్ని తూర్పార బట్టాడు. పెట్టుబడిదారీ సమాజం అధికోత్పత్తి దిశగా సాగుతుందని రుజువు చేశాడు.
ఇంతకీ ఎప్పుడో పాతరోజుల్లోనే సే సూత్రం చెల్లుబాటు కాదని తేలిపోయిన తర్వాత ఇప్పుడు ఈ చర్చ దేనికి అన్న ప్రశ్న తలెత్తవచ్చు. సే సూత్రం చెల్లదని చెప్పినది మార్క్స్ ఒక్కడే కాదు. పెట్టుబడిదారీ ఆర్థికవేత్త అయిన కీన్స్ కూడా 1930 దశకంలో తలెత్తిన మహా మాంద్యం సందర్భంగా సే సూత్రం చెల్లదని తేల్చాడు. అప్పటికి పశ్చిమ దేశాలలోని ఆర్థిక వ్యవస్థల్లో బోల్షివిక్ -తరహా విప్లవాలు తలెత్తే ప్రమాదం ఉందని గ్రహించి, దాని నుండి పెట్టుబడి దారీ వ్యవస్థను కాపాడడానికి పూనుకున్నాడు. ఆ క్రమంలో ముందు పెట్టు బడిదారీ వ్యవస్థలో తలెత్తిన లోపా లను, బల హీనతలను నిజాయితీగా గుర్తించి ఆ తర్వాత ఆ వ్యవస్థను రిపేరు చేయడానికి పూనుకోవాలని భావించాడు. అప్పుడే విప్లవాలు తలెత్తకుండా జాగ్రత్త పడగలుగుతామని అను కున్నాడు. అందుకే పెట్టుబడిదారీ వ్యవస్థలో సప్లైకి సరిపడా డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది అన్న సే సూత్రం బొత్తిగా పనికిమాలినదని ప్రకటించాడు.
ఇప్పుడు అదే సే సూత్రం మళ్లీ ఆర్థిక చర్చల్లో చోటు సంపాదించింది కనుకనే దాన్ని మనం ఇక్కడ చర్చిస్తున్నాం. నిజానికి నయా ఉదారవాద ఆర్థిక వ్యవస్థను సమర్థించుకోడానికి సే సూత్రమే ప్రాతిపదికగా ఉంది. నెహ్రూ-మహల్‌నోబిస్ వ్యూహంగా ఆర్థికవేత్తలు పిలిచే ప్రభుత్వ నియంత్రణలోని ఆర్థిక వ్యవస్థను తోసి పుచ్చడానికి, దాని స్థానంలో నయా ఉదారవాద విధానాన్ని ప్రవేశపెట్టడానికి కావలసిన మేధోపరమైన ప్రయత్నాలు నిజానికి 1970 దశకం చివర్లోనే మొదలయ్యాయి. నాలుగు దేశాలు – దక్షిణ కొరియా. తైవాన్, హాంగ్‌కాంగ్, సింగపూర్-‘ఆసియా పులులు’గా ఎదిగి భారతదేశం కన్నా చాలా ఎక్కువ వృద్ధిరేటును నమోదు చేయగలిగాయంటే దానికి కారణం ఆ దేశాలలో ప్రభుత్వ నియంత్రణ నుండి ఆర్థిక వ్యవస్థలు బయటడటమే అని ఆ మేధావులు వాదించారు. అదే మార్గంలో తక్కిన దేశాలు కూడా ప్రభుత్వ నియంత్రణ లేని ఆర్థిక వ్యవస్థలను అనుసరించడం ప్రారంభిస్తే ఆ దేశాలు కూడా అధిక వృద్ధిరేటు సాధించగలుగుతాయని వారు ప్రచారం చేశారు. ”ముడుచుకుపోయే” దృష్టితో ఉండే ‘నెహ్రూ నమూనా’ను విడిచిపెట్టి ఎగుమతుల మార్కెట్‌ను అందుకునే విధంగా వృద్ధి సాధించేందుకు నయా ఉదారవాద విధానాన్ని చేపట్టాలని బోధించడం మొదలుపెట్టారు. అప్పుడే భారతదేశం కూడా ‘ఆసియా పులి’ గా ఎదుగుతుందని వారు చెప్పారు.
అయితే వీళ్లు ముందుకు తెచ్చిన ఈ వాదన బొత్తిగా పనికిమాలినది. ప్రపంచ మార్కెట్ మొత్తంగా ఒక వేగంతో విస్తరిస్తూ వుంటే, అప్పుడు అన్ని దేశాల మొత్తం ఉత్పత్తిని కలిపి చూసినప్పుడు ఆ ఉత్పత్తి కూడా అదే వేగంతో విస్తరించగలు గుతుంది తప్ప అంతకన్నా ఎక్కువ వేగంతో కాదు (మార్కెట్ విస్తరణ వేగం ఎంత ఉంటే ఉత్పత్తి పెరుగుదల వేగం కూడా అంతే ఉంటుంది). కొన్ని దేశాలు మార్కెట్ విస్తరణ వేగం కన్నా ఎక్కువ వేగంతో తమ ఉత్పత్తిని పెంచుకుని పోగలుగుతున్నా యంటే దానికి కారణం తక్కిన దేశాలు తమ తమ ఉత్పత్తులను మార్కెట్ వేగం కన్నా తక్కువ వేగంతో చేపట్టడమే. ఇప్పటి వరకూ ఉత్పత్తి వేగంలో వెనుకబడ్డ దేశాలు గనుక ఇప్పుడు ఉత్పత్తి వేగాన్ని పెంచడం జరిగితే అప్పుడు ఇంతవరకూ వేగంగా పెరుగుతున్న దేశాలు దెబ్బతింటాయి. అందుచేత అన్ని దేశాలూ తమ తమ ఉత్పత్తులను వేగంగా పెంచుకుని ఆసియా పులుల మాదిరిగా తయారౌదామని, ఎగుమతుల మార్కెట్ లోకి పెద్ద ఎత్తున ప్రవేశిద్దామని అనుకుంటే అది వాస్తవాన్ని విస్మరించడమే ఔతుంది. ప్రపంచం మొత్తం మీద ఉన్న స్థూల డిమాండ్ పరిమితమన్నదే ఆ వాస్తవం. ఇలా విస్మరించడానికి కారణం నయా ఉదారవాద సమర్ధకులు సే సూత్రం చెల్లుబాటు ఔతుందనే పొరపాటు అవగా హనతో ఉండటమే. నెహ్రూ వ్యూహాన్ని వదిలించు కోవాలన్న పిలుపు వెనుక ఉన్నది అర్ధరహితమైన సే సూత్రానికి పెద్దపీట వేయడమే.
అయితే సే సూత్రాన్ని యథాతథంగా వారు ముందుకు తేలేదు. చాటుమాటు వ్యూహాన్ని అనుసరించి నందువల్లే వారు జయప్రదం కాగలిగారు. ఒక చిన్నదేశాన్ని ఉదాహరణగా చూపించి వారు తమ వ్యూహాన్ని ముం దుకు నెట్టారు. ఏదైనా ఒక చిన్న దేశం, అది బాగా చిన్నది అయినం దువల్ల, ఎగుమతులను బాగా పెంచుకుని అంతర్జాతీయ మార్కెట్‌లో చొరబడగలుగుతుంది. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రధానంగా డామినేట్ చేసే పెద్ద దేశాలకు ఈ చిన్న దేశపు కొద్దిపాటి ఉత్పత్తులు పెద్ద పోటీగా నిలవలేవు. అందువల్ల ఆ పెద్ద దేశాలు ఈ చిన్న దేశాల పోటీని పట్టించు కోవు. నయా ఉదారవాద సమర్ధకులు ప్రతీ దేశాన్నీ తానొక ఒక చిన్న దేశంగానే అనుకునేలా ప్రభావితం చేయగలిగారు. అందుచేత ప్రపంచ స్థూల డిమాండ్‌కి ఉన్న పరిమితిని విస్మరించేట్టు చేయగలిగారు. తద్వారా దొడ్డిదారిన సే సూత్రాన్ని ప్రవేశపెట్టగలిగారు.
విజయాలు సాధించినది కేవలం ఆ నాలుగు ఆసి యా పులులే కాదు. చైనా, ఆగేయ ఆసియా దేశాలు ఆ తర్వాత మరింత పెద్ద విజయాలు సాధించాయి. అయితే అవేవీ నయా ఉదారవాద విధాన వ్యూహాన్ని గాని, ‘ఎగుమతుల మార్కెట్ కోసం ఆర్థికవృద్ధి’ వ్యూహాన్ని గాని అనుసరించిన ఉదాహరణలు గా పరిగణించలేము. ఆ దేశాలు ఎగుమతుల్లో కూడా వృద్ధి సాధిం చాయంటే దానికి కారణం అటు పశ్చిమ సామ్రాజ్యవాద దేశాలు కూడా తమ దేశాలలోని పరిశ్రమలను చౌకగా శ్రమశక్తి అభించే ప్రాంతాలకు తరలించే వ్యూహాన్ని అసుసరించడమే. మరో విధంగా చెప్పాలంటే సంపన్న పెట్టుబడిదారీ దేశాలు తమ దేశాలో ఆర్థిక వృద్ధి వేగాన్ని తగ్గించుకోవడం వల్లనే చైనా తదితర దేశాలకు అవకాశాలు లభించాయి (సంపన్న పెట్టుబడిదారీ దేశాల పెట్టుబడులు మాత్రం ఈ మార్పు వలన వేగంగా పెరిగా యన్నది కూడా గమనించాలి). ఈ క్రమంలో తక్కిన మూడవ ప్రపంచ దేశాలు పోటీలో వెనుకబడిపోయాయి.
సే సూత్రం చెల్లుతుందంటూ తప్పుడు పద్ధతిలో వాదించడం ద్వారా ఈ ‘ఎగుమతుల మార్కెట్ కోసం వృద్ధి రటు పెంచడం’ అనే వ్యూహాన్ని ముందుకు తెచ్చి వాస్తవానికి మూడవ ప్రపంచ దేశాలను ఒకదానిపై మరొక దానిని పోటీకి ఉసిగొల్పి ంది నయా ఉదారవాదం. ఉదాహరణకు: భారతదేశం దుస్తుల మార్కెట్‌లో తన వాటాను పెంచు కోగలిగినది బంగ్లాదేశ్‌ను దెబ్బ తీయడం ద్వారానే. ఇదే పరిస్థితి ఇతర దేశాలకు కూడా వర్తిస్తుంది. బంగ్లాదేశ్ కన్నా చౌకగా మనం దుస్తులను ఎగుమతి చేయగలిగితేనే ఎగుమతుల మార్కెట్‌ను పెంచుకోగలుగుతాం. అంటే అందు కోసం ఇక్కడి శ్రామిక ప్రజానీకాన్ని మరింత ఎక్కు వగా దోపిడీ చేయడం ద్వారానే ఈ ‘ఎగుమతుల మార్కెట్‌లో మన వాటా పెంచుకోగలుగుతాం. వేతనాలను తక్కువగా చెల్లిం చడం, ఎక్కువ గంటలపాటు పని చేయించడం, న్యాయం గా కార్మికులకు చెల్లించవలసిన సొమ్మును ఎగవేయడం వంటి తప్పుడు విధానాలను ఎంత ఎక్కువగా అమలు చేస్తే అంత ఎక్కువగా మన ఎగుమతులు పెరుగుతాయి. అంటే ఈ ‘ఎగు మతుల ఆధారిత వృద్ధి’ అనేది దేశంలో ఆర్థిక అసమా నతలను పెంచే వృద్ధిగా ఉంటుంది. మరోవిధంగా చెప్పాలంటే పేదరి కాన్ని ఎక్కువగా సృస్టించే వృద్ధి ఇది.
చివరికి ఈ ‘ఎగుమతుల ఆధారిత వృద్ధి’ ప్రపంచ ఆర్థి వ్యవస్థ మొత్తం మీద డిమాండ్ మందగించడానికి దారి తీస్తుంది. దాని ఫలితంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సంక్షోభం తలెత్తుతుంది. నయా ఉదారవాదులు అను సరించిన ‘ఎగుమ తుల ఆధారిత వృద్ధి’ వ్యూహం కూడా పనికిరాకుండా పోతుంది. కరోనా మహమ్మారి విరుచుకుపడక ముందు దశాబ్దం వృద్ధి రేటు ప్రపంచం మొత్తంగా చూస్తే అది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కాలంలో తక్కిన అన్ని దశాబ్దాల కన్నా అతి తక్కువ వృద్ధి రేటుగా ఉంది. కరోనా అనంతరం అది మరింత దిగజారింది.
ఈ వ్యూహం అనైతికమైనది. అణగారిన ప్రజల మధ్య ఇది పీకలు తెగ్గోసుకునే పోటీని కల్పిస్తుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఇది చిక్కుల వలలో పడవేసింది. ఈ చిక్కుల వల నుండి బయట పడడానికి మూడవ ప్రపంచ దేశాల ముందున్నది ఒక్కటే దారి. ప్రభుత్వం జోక్యాన్ని మళ్లీ పెంచి దేశీయ మార్కెట్ విస్తరించేలా భారీ స్థాయిలో ఖర్చు చేపట్టాలి. దేశీయ మార్కెట్ విస్తరిం చాలంటే దేశంలో వ్యవసాయం వృద్ధిని వేగవంతం చేయాలి. అప్పుడు వ్యవసాయ కూలీల, రైతుల చేతుల్లో మరింత ఎక్కువ డబ్బు ఆడుతుంది. ఇంకోవైపు ప్రభుత్వం సంక్షేమ పథకాలపై ఖర్చు పెంచాలి. అప్పుడు మొత్తం శ్రామిక ప్రజానీకపు జీవన ప్ర మాణాలు మెరుగుపడతాయి. ఈ ఖర్చుకు అవసరమైన సొమ్మును సంపదపన్ను, వారసత్వ పన్ను విధించడం ద్వారా సేకరించాలి. అప్పుడు పెట్టుబడులు ఈ దేశాన్ని వదిలి పెట్టి బయటకు పోతాయి గనుక ముందే పెట్టుబడుల రాకపోకల మీద నియంత్రణను అమలు చేయాలి. ఒక్క ముక్కలో చెప్పా లంటే ఇప్పుడు అనుసరిస్తున్న ”ఎగుమతుల ఆధారిత వృద్ధి” వ్యూ హాన్ని, దాని వెనుక దాగివున్న పనికి మాలిన సే సూత్రాన్ని విస ర్జించాలి. ఇప్పటికే అది చాలా ఎక్కువ విధ్వంసాన్ని కలిగించింది.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్ పట్నాయక్
సే సూత్రంతో జరిగిన విధ్వంసం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES