సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
అంబర్‌పేట పోలీసు స్టేషన్‌లో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి, కోశాధికారి మంగకు పరామర్శ
ఆ తర్వాత వారిని విడిచిపెట్టిన పోలీసులు
నవతెలంగాణ-అంబర్‌పేట
ప్రజాస్వామ్యబద్దంగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీ టీచర్లను పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించడం దుర్మార్గమని, ఇది సభ్యసమాజానికి సిగ్గుచేటని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. సోమవారం అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం నేపథ్యంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి, కోశాధికారి మంగను పోలీసులు అరెస్టు చేసి అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి వారిని జాన్‌వెస్లీ పరామర్శించారు. పోలీస్ పై అధికారులతో మాట్లాడి వారిని విడిపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడీ సిబ్బందికి ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించినట్టుగా కనీస వేతనం రూ.18 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేస్తున్న మహిళలను నిర్బంధించడం తగదనిన్నారు.
గతంలో అంగన్వాడీ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించిన ప్రభుత్వాలు కూలిపోయాయని, ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇలాంటి చర్యలకు పాల్పడితే అదే పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్బంధాలను మానుకుని సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని కోరారు. లేనిపక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని, త్వరలో అంగన్వాడీలతో కలిసి కార్యాచరణ రూపొందించి భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఆయన వెంట సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు పద్మశ్రీ, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీరామ్ నాయక్, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, సీపీఐ(ఎం) నగర కార్యదర్శివర్గ సభ్యులు మహేందర్, కేవీపీఎస్ నగర కార్యదర్శి సుబ్బారావు తదితరులు ఉన్నారు.
అంగన్వాడీ వర్కర్ల నిర్బంధం దుర్మార్గం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



