Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పేదల అభివృద్ధి, సంక్షేమం ప్రజా ప్రభుత్వానికి సాధ్యం 

పేదల అభివృద్ధి, సంక్షేమం ప్రజా ప్రభుత్వానికి సాధ్యం 

- Advertisement -

మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం 
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు 
సన్న బియ్యం పంపిణీ దేశానికే ఆదర్శం 
కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి 
నవతెలంగాణ-పాలకుర్తి

పేదల అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి సాధ్యమని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అర్హులైన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం పేదలను మాటలతో మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేతల ప్రభుత్వమని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రజా ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తుందని తెలిపారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందించాలంటే పైరవీలే ఎక్కువగా ఉండేదని, ఎలాంటి పైరవీలు లేకుండానే రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ పథకాలను అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అని ప్రగల్బాలు పలికారు తప్ప పేదలకు పంపిణీ చేయలేదని ఆరోపించారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని, 3500 ఇండ్లు నియోజకవర్గంలో వేగవంతంగా నిర్మాణాలు కొనసాగుతున్నాయని, మొదటి, రెండవ దఫా బిల్లులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యాయని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకుంటున్న పేదల కళ్ళలో ఆనందం వెళ్లి విరుస్తుందని అన్నారు. రైతు భరోసా త రైతాంగాన్ని ఆదుకున్నామని తెలిపారు. సన్న బియ్యం పంపిణీ ప్రజా ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయం అని, సన్న బియ్యం పథకం దేశానికి ఆదర్శమన్నారు. బిఆర్ఎస్ పార్టీలో కుటుంబ కలహాలు ప్రారంభమయ్యాయని, ఆ పార్టీకి భవిష్యత్తులో మనుగడ లేదని స్పష్టం చేశారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో మనుగడలేని పార్టీలకు ప్రాధాన్యత కల్పిస్తే గ్రామాల అభివృద్ధి కుంటుపడతాయని లబ్ధిదారులకు సూచించారు.

గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలంటే రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజా ప్రభుత్వం పేదల కోసం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు విస్తృతంగా వివరించాలని, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరాయని వివరించారు. సంక్షేమ పథకాలను పొందుతున్న లబ్ధిదారులందరూ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ముందుండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లావుడియా మంజుల, తహసిల్దార్ నాగేశ్వర చారి, ఆర్ ఐ రాకేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్, కొడకండ్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, పాలకుర్తి సొసైటీ మాజీ చైర్మన్లు వీరమనేని యాకాంతరావు, అడ్డూరి రవీందర్రావు, జిల్లా మాజీ కోఆప్షన్ సభ్యులు ఎండి మదర్, నాయకులు బొమ్మగాని భాస్కర్ గౌడ్, మొలుగురి యాకయ్య గౌడ్, కమ్మగాని నాగన్న గౌడ్, పెనుగొండ రమేష్, మారం శ్రీనివాస్, గోనె మహేందర్ రెడ్డి, బండిపెళ్లి మనమ్మ, లావుడియా భాస్కర్, గుగ్గిళ్ళ ఆదినారాయణ, బెల్లి దేవేందర్, జలగం కుమార్, ఏలూరు యాకన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad