Tuesday, February 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకవితతోనే అన్ని వర్గాల అభివృద్ధి

కవితతోనే అన్ని వర్గాల అభివృద్ధి

- Advertisement -

– జాగృతిలో చేరిన కావేటి మనోహర్‌ కుమార్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధి కల్వకుంట్ల కవితతోనే సాధ్యమని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య కుమారుడు మనోహర్‌ కుమార్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని కావేటి మనోహర్‌ కుమార్‌, ఆయన సతీమణి సబిత, వారి అనుచరులు తెలంగాణ జాగృతిలో చేరారు. వారికి కండువా కప్పి కవిత సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మనోహర్‌ కుమార్‌ మాట్లాడుతూ సామాజిక తెలంగాణ, సామాజిక న్యాయ సాధన కోసం పోరాడుతున్న కవితకు మద్దతుగా జాగృతిలో చేరానని సంతోషం వ్యక్తం చేశారు. నూతన రాజకీయ పంథాను అవలంబిస్తూ యువతకు ప్రాధాన్యత ఇస్తున్న కవితకు ప్రజల్లో మరింత ఆధరణ లభిస్తున్నదని తెలిపారు. తెలంగాణ జాగృతిని బలోపేతం చేయడానికి తాను పని చేస్తానని మనోహర్‌ కుమార్‌ స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -