Wednesday, December 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామాల అభివృద్దే లక్ష్యంగా పనిచేయాలి: ఎమ్మెల్యే

గ్రామాల అభివృద్దే లక్ష్యంగా పనిచేయాలి: ఎమ్మెల్యే

- Advertisement -

ధర్మారం, చిర్రగూడూరు సర్పంచుల ప్రమాణ స్వీకారానికి హాజరైన ఎమ్మెల్యే మందుల సామెల్
నవతెలంగాణ – అడ్డ గూడూరు
గ్రామపంచాయతీ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు గ్రామాల అభివృద్దే లక్ష్యంగా పనిచేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. అడ్డ గూడూరు మండల పరిధిలోని ధర్మారం, చిర్రగూడూర్ గ్రామాలలో నూతనంగా ఎన్నికైన  సర్పంచులు మేకల మేరీ ఆనంద్, చిత్తలూరి సోమనారాయణ ల ప్రమా స్వీకారానికి   ఎమ్మెల్యే ఆయన హాజరై సర్పంచ్, ఉప సర్పంచ్,వార్డ్ మెంబర్లను శాలువతో సన్మానించి, అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన సర్పంచులు గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ గ్రామాలను అన్ని రంగాలలో ముందు ఉంచాలని అన్నారు. అదేవిధంగా  అడ్డగూడూరు మండల పరిధిలోని నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచ్లు, వార్డ్ మెంబర్లు సోమవారం ఆయా గ్రామా పంచాయతీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారులు నూతనంగా ఎన్నికైన వారిని ప్రమాణ స్వీకారం చేయించి శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామపంచాయతీ సర్పంచులు,  మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -