Friday, January 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకానిస్టేబుల్‌ కుటుంబానికి రూ.1.31 కోట్ల చెక్కును అందజేసిన డీజీపీ

కానిస్టేబుల్‌ కుటుంబానికి రూ.1.31 కోట్ల చెక్కును అందజేసిన డీజీపీ

- Advertisement -

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రోడ్డు ప్రమాదంలో మరణించిన ఓ కానిస్టేబుల్‌ కుటుంబీకులకు రూ.1.31 కోట్ల చెక్కును రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి గురువారం అందజేశారు. సెంట్రల్‌ పోలీస్‌ లైన్‌ (సీపీఎల్‌) అంబర్‌పేట్‌కు చెందిన కానిస్టేబుల్‌ బోయ పాండు, ఆయన భార్య గతేడాది మార్చిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. కానిస్టేబుల్‌ పాండుకు బరోడా బ్యాంకులో ఖాతా ఉంది. ఈ మేరకు బ్యాంకు అధికారులు మరణించిన పాండు దంపతులకు రూ.1.31 కోట్ల బీమా సొమ్మును మంజూరు చేశారు. ఈ చెక్కును డీజీపీ కానిస్టేబుల్‌ ఇద్దరు కూతుర్లకు అందజేశారు. డీజీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో బ్యాంకు అధికారులు కూడా ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -