– అభ్యుదయ సాహిత్య భావధార అంశంపై చర్చాగోష్టి
విశాఖ : ‘కష్టజీవువి’కి కుడి ఎడమ నిలిచేది కవేనని పలువురు రచయితలు అన్నారు. ఈ విషయాన్ని శ్రీశ్రీ ఎంతో చక్కగా చమత్కరించారని గుర్తుచేశారు. వీరి భావాలను జనాల్లోకి తీసుకెళ్లినవారే నిజమైన కళారులేరులను అభిప్రాయపడ్డారు. సీఐటీయూ 18వ అఖిల భారత మహాసభల సందర్భంగా విశాఖలోని ఏయూ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో కార్మిక ఉత్సవ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఏర్పాటుచేసిన శ్రామిక సాహితీవేదికపై ‘అభ్యుదయ సాహిత్య భావధార’ అనే అంశంపై మంగళవారం చర్చాగోష్టి నిర్వహించారు. విశాఖ జిల్లా అరసం అధ్యక్షులు ఉప్పల అప్పలరాజు అధ్యక్షతన జరిగిన సభలో సినీ నటుడు, నిర్మాత, మా అసోసియేషన్ ఉపాధ్యక్షులు మాదాల రవి, ప్రముఖ బహుభాషా సినీ నటి, తమిళనాడు అభ్యుదయ రచయితల సంఘం గౌరవాధ్యక్షులు రోహిణి, అట్టాడ అప్పలనాయుడు, కవి, రచయిత డాక్టర్ జీవీఎస్ జయపాలరావు, అరసం విశాఖ జిల్లా ఉపాధ్యక్షులు సర్వసిద్ధి హనుమతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళ కళకోసమో, కాసుల కోసమో కాదని, ప్రజల్లో సామాజిక చైతన్యం కోసమని అభిప్రాయపడ్డారు. తెలుగు వీరలేవరా… అంటూ మహా కవి శ్రీశ్రీ విశాఖ నుంచే ప్రజల్ని చైతన్య పర్చారని గుర్తుచేశారు. రోషిణి మాట్లాడుతూ శ్రమ విలువ, కష్ట సమాజానికి తెలియజేయడమే కళాకారుల ప్రాథమిక కర్తవ్యమని అన్నారు. ఈ విషయం తెలియజేసేందుకే శ్రామిక ఉత్సవ్‌లో పాల్గొనేందుకు విశాఖ వచ్చానని అన్నారు. నిజం నిప్పులాంటిదని, దాన్ని దాయం ఎవ్వరి తరమూ కాదని అన్నారు. తాను కూడా సందర్భానుసారంగా శాస్త్రీయ ధృక్పదంతో ప్రచారం చేసేందుకు వెనుకాబోనని అన్నారు.
‘కష్టజీవి’కి కుడిఎడమ ఉండేది కవి
- Advertisement -
- Advertisement -



