Monday, September 8, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంయూరియా కష్టాలు..

యూరియా కష్టాలు..

- Advertisement -

– మానుకోట పీఏసీఎస్‌ ఎదుట రైతుల ధర్నా
నవతెలంగాణ – మహబూబాబాద్‌
మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో యూరియా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు రోజుల నుంచి మండల కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. మహబూబాబాద్‌ పీఏసీఎస్‌ ఎదుట సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నల్లపు సుధాకర్‌ మాట్లాడుతూ.. రైతులకు వెంటనే యూరియా అందించాలని డిమాండ్‌ చేశారు. యూరియాను ఎక్కువ మోతాదులో దిగుమతి చేసుకొని రైతులకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా సరఫరా చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 9.80 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా రైతులకు అందుబాటులోకి రావాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.4.36లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా మాత్రమే రైతులకు వచ్చిందని తెలిపారు. దీనిపై ప్రభుత్వాలు స్పందించి పెండింగ్‌ యూరియా రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. విషయం తెలుసుకున్న మహబూబాబాద్‌ మండల వ్యవసాయ అధికారి తిరుపతి రెడ్డి, మహబూబాబాద్‌ టౌన్‌ ఎస్‌ఐ వచ్చి ఘటనా స్థలానికొచ్చి ఉన్నతాధికారులతో మాట్లాడి రైతులకు సరిపడా యూరియా అందుబాటులోకి తెస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad