సీఎస్ రామకృష్ణారావు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో డిజిటల్ క్రాప్ సర్వే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధికా రులను ఆదేశించారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షాసమావేశాన్ని నిర్వహిం చారు. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారుడు, అగ్రిస్టాక్ చీఫ్ నాలెడ్జ్ ఆఫీసర్ రాజీవ్ చావ్లా (రిటైర్డ్ ఐఎఎస్) అధ్యక్షతన సమావేశం జరిగింది. రెవెన్యూ కార్యదర్శి లోకేశ్‌కుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, స్టాంప్స్, రిజిస్ట్రేషన్ స్పెషల్ సెక్రెటరీ రాజీవ్‌గాంధీ హన్మంతు, ఇతర సీనియర్ అధికారులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ మార్చి 15లోగా డీసీఎస్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, ఎన్‌ఐసి అధికారుల సహకారంతో సర్వేను పూర్తి చేయాలని సూచిం చారు. రాష్ట్రంలో 10, 877 గ్రామాల్లో డీసీఎస్ సర్వే చేపట్టినట్టు అధికారులు తెలిపారు. సీజనల్ డిజిటల్ క్రాప్ సర్వే వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలకు ఉపకరిస్తుందనీ, స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జీఎస్ డీపీ) గణాంకాలకు ఈ సర్వే ఉప యుక్తంగా ఉంటుందని పేర్కొ న్నారు. దేశంలోని యూపీ, బీహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్నాటక, ఒడిశా తదితర రాష్ట్రాల్లో డిజిటల్ క్రాప్ సర్వే ప్రక్రియ పూర్తయిందని కేంద్ర ప్రభుత్వ సలహాదారుడు రాజీవ్ చావ్లా తెలిపారు. అదే తరహాలో తెలంగాణలో కూడా త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. వ్యవసాయ శాఖ సంచాలకులు గోపి ఇప్పటివరకు చేపట్టిన డిజిటల్ క్రాప్ సర్వే వివరాలను ఉన్నతాధికారులకు వివరించారని సమాచార పౌర సంబంధాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
డిజిటల్ క్రాప్ సర్వే ప్రక్రియను పూర్తిచేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



