Friday, November 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మూడేళ్ళుగా నిరుపయోగంగా డైనింగ్ హాల్..

మూడేళ్ళుగా నిరుపయోగంగా డైనింగ్ హాల్..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని మల్లారం గ్రామం ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా 3 సంవత్సరాల క్రితం రూ.12లక్షల నిధులతో విద్యార్థుల కోసం డైనింగ్ హాల్ నిర్మాణం చేపట్టి పూర్తి చేశారు. మూడు సంవత్సరాలు గడు స్తున్న అందుబాటులో తీసుక రాలేదు. దీంతో ఏళ్లుగా నిరుపయోగంగానే ఉంది. అలాగే హాల్ వినియోగం లేక పోవడంతో ముందు భాగంలోని టైయిల్స్ పెచ్చు లూడి అధ్వానంగా మారుతుంది. కాగా ఇప్పటి వరకు హాల్ నిర్మాణం చేపట్టిన సంబంధిత కాంట్రాక్టర్ కు బిల్లు సైతం పెండింగ్లో ఉండడంతో హాల్ కు తాళం వేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి హాల్ ను అందుబాటులోకి తీసుకురావాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -