‘కాల్పుల విరమణ’లోనూ చిన్నారుల మరణాలు
ఒప్పందం తర్వాత 67 మంది పాలస్తీనా పిల్లలు మృతి
ఈ ధోరణి భయంకరమెనది : యూనిసెఫ్ ఆందోళన
జెనీవా, గాజా సిటీ : అమెరికా మధ్య వర్తిత్వంతో ఇజ్రాయిల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినా.. అది నిత్యం ఉల్లంఘనలకు గురవుతున్నది. ఇజ్రాయిల్ ఈ ఒప్పందానికి పదే పదే తూట్లు పొడుస్తున్నది. గతనెల 11 నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన విషయం విదితమే. ఇక అప్పటి నుంచి ఇజ్రాయిల్ జరుపుతున్న దాడులతో గాజా పట్టణంలో 67 మంది పాలస్తీనా చిన్నారులు మృతి చెందారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి బాలల నిధి (యూనిసెఫ్) వెల్లడించింది. జెనీ వాలో జరిగిన విలేకరుల సమావేశంలో యూనిసెఫ్ ప్రతినిధి రికార్డో పైరెస్ ఈ వివరాలను వెల్లడించారు. ఈ వివరాల ప్రకారం.. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌లో ఇజ్రాయిల్ జరిపిన వైమాని కదాడిలో ఒక శిశువు ప్రాణాలు కోల్పోయింది. బుధవారం జరిగిన దాడుల్లో మరో ఏడుగురు పిల్లలు మరణించారు. ”ఇది కాల్పుల విరమణ సమయంలో జరుగుతోంది. ఈ ధోరణి భయం కరమైంది” అని రికార్డో పైరెస్ అన్నారు. ప్రతి మరణం వెనుక ఒక కుటుంబం.. ఒక కల ఉంది. నిరసంతర హింస వీటన్నిటినీ క్షణాల్లో నేలమట్టం చేస్తోంది” అని ఆయన ఆందోళన వెలిబుచ్చారు.
అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా కూడా ఇజ్రాయిల్ తన యుద్ధోన్మాద చర్యలను కొనసాగిస్తున్నది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తున్నది. దీంతో అమాయకు లైన చిన్నారులు, మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇజ్రాయిల్ చర్యలతో గాజాలో అత్యవసర సేవలకు అంతరాయం ఏర్పడింది. ఆస్పత్రులు దాదాపు పని చేయలేని స్థితికి చేరు కున్నాయి. విద్యుత్ లేకపోవటంతో శస్త్రచికిత్సలకు ఆటంకం ఏర్పడుతోంది. మందులు, బెడ్లు, నర్సులు అందు బాటులో లేరు. దీంతో చిన్న గాయాలు కూడా ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఇక గాజాలోని పిల్లలు విద్యకు దూరమయ్యారు. ఏకంగా ఒక తరమే చదువుకు దూరమైందని పలువురు మేధావులు చెప్తు న్నారు. ఈ పరిస్థితులు గాజా భవిష్యత్‌పై తీవ్ర ప్రభా వాన్ని చూపుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పిల్లలపై యుద్ధ ప్రభావం
ఇజ్రాయిల్ వరుస దాడులతో పాలస్తీనాలోని సాధారణ పౌరులేగాక.. మహిళలు, చిన్నారులు కూడా చనిపోతున్నారు. 2023 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయిల్ చేసినదాడులలో 64వేల మంది పాలస్తీనా చిన్నారులు మరణించటం, గాయపడటం జరిగిందని యూనిసెఫ్ అంచనా వేస్తోంది. సేవ్ ద చిల్డ్రెన్ నివేదిక ప్రకారం.. సగటున 475 మంది పాలస్తీ నా చిన్నారులు ‘జీవితాంతం మిగిలిపోయే గాయాల’తో బాధపడు తున్నారు. అలాగే గాజాపై ఇజ్రాయిల్ విధిస్తున్న ఆంక్షల కారణంగా ఆహార కొరత తీవ్రమై.. పిల్లలు ఆకలితో మరణించే ఘటనలూ అక్కడ నమోదవు తున్నాయి. ఈ వారం ఖాన్ యూనిస్ ప్రాంతంలో తమ సైనికులపై కాల్పులు జరిగాయన్న కారణం చూపి ఇజ్రాయిల్ గాజాపై వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో కనీసం 32 మంది పాలస్తీనీయులు మరణించారని కథనాలు వెలువడ్డాయి.
చలిలో వణుకుతున్న చిన్నారులు
ఇజ్రాయిల్ సహాయక సరుకుల రవాణాపై కొనసాగిస్తున్న ఆంక్షలతో గాజా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో అవసరమైన గూడారాలు, వేడి ఏర్పాట్లు లేకపోవటంతో పిల్లలు బయటే పడుకుంటూ వణుకు తున్నారు. ”గాజాలో పిల్లలకు సురక్షిత స్థలం ఎక్కడా లేదు. వారి బాధల్ని ప్రపం చం సాధారణంగా తీసుకోవద్దు” అని పైరెస్ పిలుపునిచ్చారు.



