నవతెలంగాణ – కంఠేశర్
నగరంలోని ఒకటవ పోలీస్ స్టేషన్ పరిధిలో చెవులు వినపడవు, మాటలు రాని ఓ యువకుడు అదృశ్యమైనట్లు ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ రఘుపతి బుధవారం తెలిపారు. ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లాకు చెందిన కేతావత్ కృష్ణ 19 సంవత్సరాలు మతిస్థిమితం బాగా లేనందున గవర్నమెంట్ హాస్పిటల్ నందు అడ్మిట్ చేసినారు. చికిత్స అనంతరం తేదీ 28 ఉదయం 11 గంటల కు డిశ్చార్జ్ చేసేటప్పుడు తన యొక్క తమ్ముడు కేతవత్ కృష్ణ ఎవరికీ చెప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్ నుండి వెళ్లిపోయినాడు. అతని గురించి చుట్టుపక్కల అంతా వెతికి తన యొక్క బంధువులకు విచారించగా ఎటువంటి జాడ లభించలేదు. తన యొక్క తమ్ముడికి చెవులు వినబడవు మాటలు రావు అని తన అన్న కితావత్ అరవింద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్హెచ్ఓ తెలిపారు. కావున నిజామాబాద్ లో ఎక్కడైనా ఫోటోలో ఉన్న వ్యక్తి కనిపిస్తే నిజామాబాద్ ఒకటవ పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని ప్రజలను కోరారు.
యువకుడి అదృశ్యం ..
- Advertisement -
RELATED ARTICLES