Saturday, January 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవిధుల్లో జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకోవద్దు

విధుల్లో జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకోవద్దు

- Advertisement -

తెలంగాణ బోధనా వైద్యుల సంఘం డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ఆస్పత్రులు, మెడికల్‌ కాలేజీల్లోని డాక్టర్లు, ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్ల రోజువారీ విధుల్లో జిల్లా పరిపాలనా అధికారుల అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారనీ, దాన్ని నివారించాలని తెలంగాణ బోధనా వైద్యుల సంఘం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో డీఎంఈ నరేందర్‌కు తెలంగాణ బోధనా వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ బొల్లేపాక కిరణ్‌, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ మాదాల కిరణ్‌ వినతిపత్రం అందజేశారు. నర్సంపేటలో నిజాయితీ, నిబద్ధతతో పనిచేస్తున్న అదనపు డీఎంఈను సరైన కారణం లేకుండా మార్చిన విషయం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. రోజువారీ అకాడమిక్‌, పరిపాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్న అంశాన్ని ప్రస్తావించారు. ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని డీఎంఈ తమకు హామీనిచ్చారని వారు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -