Wednesday, February 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్…

కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్…

- Advertisement -

నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్  : మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు  జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో భువనగిరి మండలంలోని దివ్య బాల విద్యాలయంలో భువనగిరి, చౌటుప్పల్ ,పోచంపల్లి, యాదగిరిగుట్ట, ఆలేరు, మోత్కూర్ మున్సిపాలిటీలకు సంబంధించిన  కౌంటింగ్ ఏర్పాట్లను స్ధానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావుతో కలిసి జిల్లా కలెక్టర్  ప్రత్యక్షంగా పరిశీలించారు. 
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కౌంటింగ్ హాల్స్, స్ట్రాంగ్ రూమ్స్, సీసీ కెమెరాల ఏర్పాటు, భద్రతా ఏర్పాట్లు, టేబుళ్ల అమరిక, సిబ్బంది నియామకాలు వంటి అంశాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.కౌంటింగ్ ప్రక్రియ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం కచ్చితంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి టేబుల్ వద్ద అంజర్వర్లు,సిబ్బంది  అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అభ్యర్థులు, ఏజెంట్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, కూర్చునే సౌకర్యం, ప్రాథమిక వైద్య సదుపాయాలు కల్పించాలని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మూడు అంచల భద్రత కల్పించాలని, అనుమతి ఉన్నవారికి మాత్రమే ప్రవేశం ఇవ్వాలని స్పష్టం చేశారు. కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియ  పారదర్శకంగా పూర్తి చేసి ఫలితాలను సమయానికి ప్రకటించాలని జిల్లా కలెక్టర్ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -