జాతీయ మెగా లోక్-అదాలత్ లో 7444 కేసులలో రాజీ
సైబర్ నేరగాళ్ల చేతిలో కోల్పోయిన రూ. 42,45,273-00 తిరిగి సైబర్ బాధితులకు అందజేత
నవతెలంగాణ – కంఠేశ్వర్
జాతీయ మెగా లోక్-అదాలత్ ను విజయవంతం చేసిన అధికారులను, సిబ్బందిని నిజామాబాదు పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య అభినందించారు. గత నెల రోజుల నుండి తేది 13.09.2025 వరకు జరిగిన జాతీయ మెగా లోక్-అదాలత్ లో భాగంగా , జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన , రాజీ పడటానికి అవకాశం ఉన్నటువంటి మరియు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఐ.పి.సి ,బి.ఎన్.ఎస్ 501 కేసులు, సైబర్ క్రైమ్ 138 కేసులు, ఇ-పెట్టి 1958 కేసులు, డి.డి & ఎంవి యాక్ట్ 4985, మొత్తం 7444 కేసులలో ఇరు వర్గాలను రాజీ కుదిరచడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ.. జాతీయ మెగా లోక్-అదాలత్ లో భాగంగా నిజామాబాదు జిల్లా కు సైబర్ క్రైమ్ మరియు వివిధ కేసులలో రాజీ మార్గం చేసినందుకు నిజామాబాదు జిల్లాకు 4వ స్థానం రావడం జరిగిందన్నారు. జిల్లాను రాష్ట్ర స్థాయిలో అగ్రగామిగా ఉంచడంలో కృషి చేసిన అధికారులు, సైబర్ క్రైమ్ సిబ్బంది కోర్టు సిబ్బందిని జిల్లా పోలీస్ కమీషనర్ అభినందించారు. క్షణికావేశంలో చేసే తప్పులను సరిదిద్దుకోవాడానికి లోక్-అదాలత్ అనేది ఒక మంచి అవకాశం అని , అనవసర గొడవలకు పోయి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోకూడదని అన్నారు. రాజీ మార్గమే రాజా మార్గం అని, రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్న అన్ని కేసులల్లో ఇరు వర్గాలు రాజీపడవచ్చు అన్నారు.
ముఖ్యంగా సైబర్ బాధితులకు సత్వర న్యాయం చేయాలని, టీఎస్ సిఎస్బి [తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో] డైరెక్టర్ శిఖాగోయల్ ఐపిఎస్. ఆద్వర్యంలో 7 కమీషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లు, ప్రతి జిల్లాలో డి 4 సి ని ఏర్పాటు చేసి డియస్పి స్థాయి అధికారులచే పర్యాయవేక్షించడం జరుగుతుందన్నారు. నిజామాబాదు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన సైబర్ నేరాలలో ఈ జాతీయ మెగా లోక్-అదాలత్ నందు 138 సైబర్ క్రైమ్ కేసులలో 42,45,273-00 రూపాయలను తిరిగి సైబర్ బాధితులకు ఇప్పించేందుకు ఆర్డర్ కాపీలను సంబంధిత బ్యాంక్ నోడల్ అధికారులకు పంపించడం జరిగిందన్నారు. జిల్లా ప్రజలెవరైనా సైబర్ మోసాలకు గురి అయినట్లయితే వెంటనే 1930 కి కాల్ చేసి గాని, http://cybercrime.gov.in పోర్టల్ నందు లాగిన్ అయి దరఖాస్తు చేయవచ్చు అన్నారు. ఈ సందర్భంగా జాతీయ మెగా లోక్-అదాలత్ ను విజయవంతం చేసిన అధికారులు సైబర్ క్రైమ్ ఏసిపి వై. వెంకటేశ్వర్ రావ్ , సిఐ ముఖిద్ పాషా , సిసిఆర్బి సిఐ సతీష్ , కోర్ట్ డ్యూటీ , సైబర్ సెల్ సిబ్బందిని పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య అభినందించారు.