నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : యాదాద్రి భువనగిరి జిల్లాను డైరియా జిల్లాగా మార్చాలని యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర రావు అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో టాస్క్ఫోర్స్ సమావేశానికి అధ్యక్షత వహించి, మాట్లాడారు. ఇంటింటికి ఒఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ, పిల్లలకు జింక్ టాబ్లెట్ల వినియోగం, తాగునీటి శుద్ధిపై పరీక్షలు, హైపోక్లోరైట్ పంపిణీ నిర్వహించడం, స్వచ్ఛతపై అవగాహన ర్యాలీలు, స్కూల్, అంగన్‌వాడీల్లో హ్యాండ్ వాషింగ్ డే నిర్వహణ
అన్ని శాఖల ద్వారా సమన్వయపూర్వకంగా ప్రచారం చేయాలని సూచించారు. అనంతరం డీఎంఅండ్‌హెచ్‌ఓ డా. మనోహర్ మాట్లాడుతూ .. “ఆశా, అంగన్‌వాడీ, ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలి. ప్రతిరోజూ డేటా నమోదు చేసి డీఓ కార్యాలయానికి పంపాలి.” అని స్పష్టం చేశారు. డీఐఓ డా. కె రామకృష్ణ మాట్లాడుతూ “స్టాప్ డయేరియా క్యాంపెయిన్ జూలై 31వ తేదీ వరకు అమలులో ఉంటుందనారు. ఇంటింటికి ఓఆర్ఎస్ జింక్ మాత్రలు పంపిణీ చేయాలని, హైపోక్లోరైట్ పంపిణీ & నీటి పరీక్ష నిర్వహించాలని తెలిపారు. గ్రామ స్థాయిలో స్కూల్‌లలో ఆరోగ్యం, రోజువారీ రిపోర్టింగ్, వారాంత సమీక్ష నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ జిల్లా ప్రోగ్రాం అధికారులు డాక్టర్ సాయి శోభ, డాక్టర్ శిల్పిణి, డాక్టర్ యశోద, డాక్టర్ సుమన్ కళ్యాణ్, డెమో అంజయ్య పాల్గొన్నారు.