- Advertisement -
ఐఎంఎఫ్ గీతా గోపీనాథ్ అంచనా
వాషింగ్టన్ : సమీప భవిష్యత్‌లో డాలర్ ఆధిపత్యం తగ్గకపోవచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) మాజీ చీఫ్ ఎకనమిస్ట్, డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ అన్నారు. ఆమె ప్రస్తుతం హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పని చేస్తోన్నారు. అమెరికా సంస్థల బలం, ఆర్థిక మార్కెట్ల బలహీతనల కారణంగా డాలర్ ఆధిపత్యం దగ్గరలో మారే అవకాశం లేదని గోపీనాథ్ పేర్కొన్నారు. కేవలం వాణిజ్యంలోనే కాకుండా ఆర్థిక రంగంలో, చెల్లింపులలో, రిజర్వ్‌లలో డాలర్ ఆధిపత్యం కనబడుతుందన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ కీలక పాత్ర పోశిస్తోందన్నారు.
- Advertisement -