Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్నెరవేరుతున్న పేదల సొంతింటి కల

నెరవేరుతున్న పేదల సొంతింటి కల

- Advertisement -

– వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య 
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండలంలోని ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతో పేదల సొంతింటి కల నెరవేరుతుందని కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య అన్నారు. గురువారం మండలంలోని కోన సముందర్ గ్రామంలో ఇటీవల ఐదుగురు లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవితో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదల సొంతింటి కలలను నెరవేరుస్తున్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తుందన్నారు. మహిళల అభివృద్ధి సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గ్రామాల్లో ఎవరికైనా ఇందిరమ్మ ఇల్లు రాకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులైతే వారికి కూడా తప్పకుండా ఇందిరమ్మ ఇండ్లను అందించడం జరుగుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణాలను చేపట్టి, పూర్తి చేసుకోవడం ద్వారా సొంతింటి కలను నెరవేర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ జైడి శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్,  మాజీ ఎంపీపీ గుడిసే అంజమ్మ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నూకల బుచ్చి మల్లయ్య, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad