Saturday, February 21, 2026
E-PAPER
Homeజాతీయంనెరవేరిన పేదల సొంతింటి కల

నెరవేరిన పేదల సొంతింటి కల

- Advertisement -

కేరళలో ఐదు లక్షల ఇండ్ల నిర్మాణం పూర్తి
మైలురాయిని చేరుకున్న లైఫ్‌ మిషన్‌

తిరువనంతపురం: 53 ఏండ్ల ఉషకు కొత్త ఇల్లు అనేది ఆమె తలపై పైకప్పు మాత్రమే కాదు. ఆమె చిరకాల కోరిక. ఎప్పటి కౖనా మళ్లీ సొంతింట్లో అడుగు పెడతామనే చిన్న ఆశ. అనుకున్నట్టుగానే పూజప్పురలో కేవలం మూడు సెంట్ల స్థలంలో… చిన్నదే కానీ అందంగా నిర్మించిన ఇల్లు ఉషకు దక్కింది. ఇప్పుడది పుతుస్సేరి హౌస్‌లోని ఆమె భర్త సురేంద్రన్‌కు స్థితిస్థాపకత, పునరుద్ధరించబడిన ఆశకు చిహ్నంగా నిలుస్తోంది. హాలు, చక్కగా టైల్స్‌ వేసిన ప్రాంగణం, కాంపౌండ్‌ గోడను కప్పి ఉంచే పూల మొక్కలతో పూర్తి చేయబడిన నిరాడంబరమైన రెండు గదుల ఇంటి నిర్మాణం. అయితే ఇది ఆమెకు సంవత్సరాల పోరాటం ద్వారా వచ్చిన ఫలితం. కేరళా ప్రభుత్వం అమలు చేస్తున్న లైఫ్‌ మిషన్‌ ద్వారా సొంతమైంది. దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం ఉష కుటుంబం పెరుగుతున్న వైద్య ఖర్చులను తీర్చడానికి తమ సొంత ఇంటిని అమ్ముకోవాల్సి వచ్చింది.

అప్పటి నుంచి.. వారు ఏదో ఒక రోజు మళ్ళీ సొంతింటిని ఏర్పాటు చేసుకుంటామనే ఆశతో అద్దె ఇంట్లోనే నివాసమున్నారు. ఇప్పుడు సొంతింటి కల నెరవేరుతుండటంతో ఆమె సంతోషంగా ఉన్నారు. ఆమె మాటల్లోనే… ”ఈ ప్రభుత్వం లేకుంటే మాకు అలాంటి ఇల్లు లభించేదా? మేము మాత్రమే కాదు, ఇక్కడ చాలా కుటుంబాలు ప్రయోజనం పొందాయి. గతంలో నేను ఎప్పుడూ ఆస్పత్రుల్లో, బయటా ఉండే దానిని” అని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఆమె మెదడులోని రక్తనాళం పగిలి ఏడు రోజుల పాటు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆమె జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. తిరువనంతపురంలోని శ్రీ చిత్ర ఆస్పత్రిలో సుదీర్ఘ చికిత్స తర్వాత ఆమె కోలుకుంది, కానీ ఆర్థిక, భావోద్వేగ ఒత్తిడి అలాగే ఉంది. ”ఇల్లు సొంతం కావడంతో నా మనస్సులోని కోరిక నెరవేరింది. లైఫ్‌ మిషన్‌ కింద మాకు ఇల్లు లభించడం వల్ల వచ్చిన ఈ ఆనందం మాటల్లో చెప్పలేనిది” అని ఉష అన్నారు.

లైఫ్‌ మిషన్‌ ద్వారా ఐదు లక్షల ఇండ్ల నిర్మాణం
కేరళ అంతటా నిరాశ్రయులైన , భూమిలేని కుటుంబాలకు సురక్షితమైన గృహాలను అందించే లక్ష్యంతో మే 23, 2017న ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం లైఫ్‌ మిషన్‌ ద్వారా గృహనిర్మాణ పథకాన్ని ప్రకటించింది. సంవత్సరాలుగా ఈ కార్యక్రమం రాష్ట్రంలోని అత్యంత ముఖ్యమైన సంక్షేమ కార్యక్రమాలలో ఒకటిగా సాగింది. ఈనెల 24న పూజప్పురలో జరిగే కార్యక్రమంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఐదు లక్షల ఇండ్ల మైలు రాయిని అధికారికంగా ప్రకటించనున్నారు. జనవరి 31 వరకు అందుబాటులో ఉన్న అధికారిక గణాంకాల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా 4,82,736 ఇండ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది, 1,17,874 ఇండ్ల నిర్మాణం ప్రస్తుతం వివిధ దశల్లో ఉంది.

హడ్కో రుణం నుంచి మొదటి విడతలో రూ.400 కోట్లు విడుదల చేయడంతో నిర్మాణ కార్యకలాపాలు గణనీయంగా వేగవంతమయ్యాయని అధికారులు తెలిపారు. ఇప్పుడు ఆర్థిక సహాయం అందుబాటులో ఉండటంతో, ఫిబ్రవరిలో మరిన్ని ఇండ్లు పూర్తవుతాయని భావిస్తున్నారు. ఇది ఈ పథకం అమలును మరింత వేగవంతం చేస్తుంది. ఈ పథకం కింద మొత్తం ఖర్చు రూ.20,638.16 కోట్లకు చేరుకుంది. వీటిలో రూ.18,149.26 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించింది. మిషన్‌ నుంచి వచ్చిన డేటా ప్రకారం ప్రతిరోజూ సగటున 152 ఇండ్లు నిర్మిస్తున్నారు – దాదాపు ప్రతి గంటకు ఆరు ఇండ్లు లేదా ప్రతి పది నిమిషాలకు ఒక ఇల్లు – ఇది గృహనిర్మాణ చొరవ తీసుకోవటంతో వేగాన్ని ప్రతిబింబిస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -