నవతెలంగాణ – హైదరాబాద్ : పేదల సొంతింటి కల సాకారం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతోనే సాధ్యమవుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లాలో సొంత నియోజకవర్గం మధిరలో పర్యటించిన ఆయన.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఇల్లు లేని పేదల బాధలను అర్థం చేసుకొని ప్రజా ప్రభుత్వం రూ.22,500 కోట్లతో తొలి ఏడాది 4.50లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇన్ని ఇళ్లు ఇచ్చిన చరిత్ర లేదన్నారు. రాష్ట్రంలో 1.20కోట్ల కుటుంబాలు ఉంటే.. 93లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఇచ్చి వారికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే 56 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. రూ.8వేల కోట్లతో నిరుద్యోగుల కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు.
పేదల సొంతింటి కల కాంగ్రెస్‌తోనే సాధ్యం: భట్టి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES