Wednesday, May 21, 2025
Homeతెలంగాణ రౌండప్నెరవేరనున్న సొంతింటి కల.!

నెరవేరనున్న సొంతింటి కల.!

- Advertisement -

– మొదటి విడతలో 221 మంది ఎంపిక
– పైలట్ ప్రాజెక్టుగా నాచారం.

నవ తెలంగాణ మల్హర్ రావు:
అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటోంది. గ్రామాల్లో అర్హులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోంది. మండలంలోని 15 గ్రామ పంచాయతీలకుగాను మొదటి విడతలో 221 మంది లబ్దిదారులను ఎంపిక చేశారు. ప్రతి ఇంటికి ప్రభుత్వం రూ.5 లక్షలు మంజూరు చేయనుంది. దీంతో సొంతింటి కల నెరవేరబోతోందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మొదటి విడత బిల్లు మంజూరు..
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా మండలంలోని నాచారం గ్రామ పంచాయతీని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఆ గ్రామంలో మొత్తం 130 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి ఇళ్లు మంజూరు చేశారు.కానీ లబ్దిదారులు ఇళ్ల నిర్మాణ పనులు ఇంకా ప్రారంభించలేదు.అదేవిధంగా మండలంలోని తాడిచెర్లలో 100,మల్లారంలో 8,పెద్దతూoడ్లలో 10,చిన్నతూoడ్లలో 8, దుబ్బపేటలో 3,అడ్వాలపల్లిలో 5, ఆన్ సాన్ పల్లిలో 10,ఎడ్లపల్లిలో 10,ఇప్పలపల్లిలో 8,కొండంపేటలో 8,కోయ్యుర్ లో 8, మల్లంపల్లిలో 3,రుద్రారంలో 30,వళ్లెంకుంటలో 10,ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. లబ్దిదారులందరూ ఇళ్ల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభించవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.
ప్రభుత్వ నిబంధనలు..
పథకం ప్రారంభంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం ప్రభుత్వ నిబంధనల ప్రకారం 400 ఎస్ఎఫ్తో నిర్మించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం 400 నుంచి 600 ఎస్ఎఫ్ వరకు పరిమితిని పెంచారు. దీంతో మొదటి విడతలో ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -