నూతన గృహాలను ప్రారంభించిన మంత్రి పొంగులేటి
నవతెలంగాణ-సత్తుపల్లి
పేదల సొంతింటి కల ఇందిరమ్మ పథకం ద్వారా సాకారమవుతోందని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదివారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 11, 22, 23 వార్డుల పరిధిలో లబ్ధిదారులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇండ్లను మంత్రి పొంగులేటి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పేదల కుటుంబాల్లో ఆనందాన్ని చూస్తున్నామన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేండ్ల పాటు డబుల్ ఇండ్ల పేరుతో పేదలను మోసం చేసిందన్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికి సంక్షేమా భివృద్ధి కార్యక్రమాలను రెండు కళ్లులా భావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసుకుంటూ వస్తోందన్నారు.
మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు రాలేదని అధైర్య పడొద్దన్నారు. అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి ఇందిరమ్మ ఇంటిని కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్, ఏఎంసీ ఛైర్మెన్ దోమ ఆనంద్‌బాబు, పట్టణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గాదె చెన్నకేశవరావు, శివా సత్యనారాయణమూర్తి (వేణు), నాయకులు దొడ్డా శ్రీనివాసరావు, మొహమ్మద్ కమల్‌పాషా, భీమిరెడ్డి సుబ్బారెడ్డి, మందపాటి ముత్తారెడ్డి, పింగుల సామేలు, దూదిపాల రాంబాబు, గొర్లమారి రామ్మోహనరెడ్డి, కంటె నాగలక్ష్మి పాల్గొన్నారు.
పేదల సొంతింటి కల’ఇందిరమ్మ’తో సాకారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



