Monday, October 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ రాజ్యంలోనే పేదింటి కల నెరవేరింది: ఎమ్మెల్యే

ఇందిరమ్మ రాజ్యంలోనే పేదింటి కల నెరవేరింది: ఎమ్మెల్యే

- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటానని ఇంటి యజమాని భావోద్వేగం
నవతెలంగాణ – నవాబు పేట

ఇందిరమ్మ రాజ్యంలోనే పేదింటి కల నెరవేరిందని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో నూతనంగా మంజూరై నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడైనా ఏనాడైనా పేదల పక్షాన ఉంటుందని పేదల సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని, గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం ఇళ్లను మంజూరు చేస్తూ పేదల పక్షాన దేవునిలా నిలబడుతున్నారని అన్నారు. పేదల కోసం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టిన హామ్ పథకంలో భాగంగా రోడ్ల విస్తరణ, రోడ్ల ఆధునికీకరణ, మరమ్మత్తులలో భాగంగా మండల కేంద్రానికి ఆయా గ్రామాల నుంచి వచ్చే ప్రధాన రోడ్డు మార్గాలను కలుపుకొని డబుల్ రోడ్లుగా మార్చేందుకు నవాబ్ పేట వయా పోమాల కొల్లూరుకు12.5 కీలోమీటర్లు, బాలనగర్ మండల నుండి నవాబ్ పేటకు వయా లింగంపల్లి రోడ్డును 7 కిలోమీటర్లు, ఎన్మనగండ్ల నుండి కారూరు రోడ్డు 9 కిలో మీటర్ల వరకు దాదాపు 28 కిలోమీటర్లు రోడ్డు మార్గాలను డబల్ రోడ్డుగా మార్చేందుకు నిధులు మంజూరు కావడం జరిగిందని తెలిపారు.

గతంలో కూడా ఎన్నో రోడ్లను గత రెండు సంవత్సరాల పాటు నవాబుపేట నుండి దోండ్లపల్లి రోడ్డు వరకు డబుల్ లైన్ రోడ్డును మంజూరు చేయించి పనులు కూడా పూర్తి చేసే పని కొనసాగుతుందని గుర్తు చేశారు. రైతులకు విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా 133/33 కిలోవాట్స్ విద్యుత్ సబ్ స్టేషన్ తో పాటు 33/11కిలో వాట్స్ విద్యుత్ సబ్ స్టేషన్ లను మంజూరు చేయించి రైతులకు వ్యవసాయ సంబంధిత సమస్యలు లేకుండా ముందస్తు చర్యగా పనిచేయడం జరిగింది అని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జయరాం నాయక్,గిర్దావారు గాయత్రి,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హరలింగం వైస్ చైర్మన్ తులసి రాం నాయక్ , మైసమ్మ దేవాలయ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి,పీఏసీఎస్ చైర్మన్ నర్సింహులు,వ్యవసాయ అధికారి కృష్ణ కిషోర్ హౌసింగ్ అధికారులు,నాయకులు వెంకటేష్ గౌడ్, నవాజ్ రెడ్డి, వాసు యాదవ్,రమేష్ గౌడ్, నీలకంఠం,రవిందర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, కృష్ణ గౌడ్,కోట్ల రాజేష్,కొల్లి నర్సింహులు,చిర్ప సత్యం,అమ్మాపూర్ నర్సింహులు, ఆనంద్,హమీద్ మహెక్ తానెం సుధాకర్,తానెం రాజు, ఆశన్న,ఖాజా మైనోద్దీన్,రాజశేఖర్,యాదయ్య బంక వెంకటయ్య బంక ఆంజనేయులు కుమార్, ఎండీ ఉమర్,సురెందర్ ,రైతు సంఘాల నాయకులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -