Thursday, August 14, 2025
EPAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్డ్రగ్స్ మహమ్మారీ జీవితాలను చిన్నభిన్నం చేస్తుంది

డ్రగ్స్ మహమ్మారీ జీవితాలను చిన్నభిన్నం చేస్తుంది

- Advertisement -

– కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి 
– విద్యార్థులకు డ్రగ్స్ పై అవగాహన
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
డ్రగ్స్ మహమ్మారీ జీవితాలను చిన్నభిన్నం చేస్తుందని కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని బషీరాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ అనిల్ రెడ్డి విద్యార్థులకు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. అంతరం ఎస్ఐ మాట్లాడుతూ.. గంజాయి, మత్తుపదార్థాలకు యువత విద్యార్థులు దూరంగా ఉండాలన్నారు. యువత చెడు అలవాట్ల వైపు తొందరగా ఆకర్షితులు అవుతారని, మన మనస్సును మనం మన అదుపులో ఉంచుకున్నప్పుడే చెడు అలవాట్లకు దూరంగా ఉంటామన్నారు.

యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు  అలవాటు పడి ఆరోగ్యంతో పాటు ఎంతో విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దన్నారు. డ్రగ్స్ కు అలవాటు పడినవారు ఆ మత్తులో వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు గురై విలువైన ప్రాణాలను పోగొట్టుకొని కుటుంబ సభ్యులకు విషాదాన్ని మిగులుస్తున్నారన్నారు.డ్రగ్స్ మహమ్మారి వల్లే క్రైమ్ రేట్ కూడా పెరుగుతుందన్నారు. యువత చెడు అలవాటులకు దూరంగా ఉన్నప్పుడే సమాజంలో ప్రశాంత వాతావరణం ఏర్పడి క్రైమ్ రేటు తగ్గుతుంది అన్నారు. మత్తులో వాహనాలు నడపడం వల్ల మన ప్రాణాలను పోగొట్టుకోవడమే కాకుండా, ఎదుటివారి పాణాలను కూడా అరిస్తున్నామనే విషయాన్ని యువత గుర్తుంచుకోవాలన్నారు. యువత జీవితంలో పైకి ఎదగాలంటే చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. అంతకు ముందు పేయర్ సమయంలో పాఠశాలల విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు.  కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కనుక గంగాధర్, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad