Monday, April 6, 2026
E-PAPER
Homeఖమ్మంప్రజాసమస్యల పరిష్కారమే ప్రజా ప్రతినిధుల విధులు

ప్రజాసమస్యల పరిష్కారమే ప్రజా ప్రతినిధుల విధులు

- Advertisement -

– వార్డు సభ్యులకు అవగాహన లో ఆత్మ(బీఎఫ్ఏసీ) చైర్మన్ సుంకవల్లి 
నవతెలంగాణ – అశ్వారావుపేట 

ఎన్నిక కాబడిన ప్రాంతంలో ప్రజలు తరుపున ప్రాతినిధ్యం వహిస్తూ వారి సమస్యలు పరిష్కారం చేయడం మే ప్రజాప్రతినిధులు కర్తవ్యంగా పనిచేయాలని ఆత్మ (బీఎఫ్ఏసీ) చైర్మన్ సుంకవల్లి వీరభద్ర రావు పంచాయతీ పాలకవర్గం సభ్యులు కు సూచించారు. మండలంలోని 15 గ్రామ పంచాయతీలకు చెందిన 124 మంది వార్డు సభ్యుల కోసం నిర్వహిస్తున్న 5 రోజుల ప్రభుత్వ శిక్షణ కార్యక్రమం (బ్యాచ్–1) ఫిబ్రవరి 23 (సోమవారం ) మున్సిపాలిటీ పరిధిలోని రైతు వేదిక లో ఎంపీఓ రామ కోట రెడ్డి పర్యవేక్షణ ప్రారంభించారు.

ఇందులో ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ .. శిక్షణ కార్యక్రమం ఫిబ్రవరి 23 నుండి 27 శుక్రవారం వరకు కొనసాగనుంది అని, ఇందులో గ్రామ పాలన,అభివృద్ధి కార్యక్రమాల అమలు,వార్డు సభ్యుల విధులు – బాధ్యతలపై అవగాహన కొరకు శిక్షణ ఇవ్వబడుతుంది అని తెలిపారు. మొదటి రోజు 110 మంది హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ప్రత్యేక అధికారి, పశుసంవర్ధక శాఖ అదనపు సంచాలకులు డాక్టర్ ప్రదీప్ కుమార్, తహశీల్దార్ సీహెచ్వీ రామక్రిష్ణ, ఎంపీడీవో అప్పారావు,ట్రైనర్స్ కోటమర్తి శ్రీరామమూర్తి ,నార్లపాటి జగదీష్, కార్తీక్,ఎం.డీ ఖాన్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -