Wednesday, July 9, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిమేడే తొలినాళ్లు మళ్లీ గుర్తుకొస్తున్నాయి!

మేడే తొలినాళ్లు మళ్లీ గుర్తుకొస్తున్నాయి!

- Advertisement -

ఎనిమిది గంటల పనిదినం కోసం
ఉరికంబమెక్కిన
కార్మికోద్యమ వైతాళికుల త్యాగాలు
మళ్లీ గుర్తుకొస్తున్నాయి!
హేగ్‌ మార్కెట్‌లో నెత్తురొలికించిన
కార్మికవీరుల నినాదాలు
మళ్లీ గుర్తుకొస్తున్నాయి!

చరిత్ర పునరావృతమౌతోందా!
శ్రమజీవుల రక్తంతో
మళ్లీ ఎర్రజెండా రెప రెపలాడాల్సిందేనా!
ఎనిమిది గంటల పనికి మంగళం పాడి
కార్మిక చట్టాలను తిరగరాస్తూ
లాభాలకోసం రక్త పిపాసులుగా మారిన
పెట్టుబడిదారులకు ముకుతాడు వేసేందుకు
కార్మిక వర్గం మరోసారి ఉవ్వెత్తున లేచి నిలబడాల్సిన
సమర సమయం ఆసన్నమయింది!
పాలకులెప్పుడు పెట్టుబడికి కాపలాదారులే!
వాళ్ల చేతిలో రాజదండం ఏనాడు
కార్మికులకు అండగా నిలబడలేదు!
కార్మికవర్గం స్వశక్తితోనే పోరాటం చేయాలి
రాజ్యాధికార సాధనకై తుది పోరు మొదలెట్టాలి!
అదిగో..జులై 9, సమర శంఖారావం మోగింది!
పదండి ముందుకు.. పదండి తోసుకు..
సమరం చేద్దాం!

-సత్యభాస్కర్‌, 9848391638

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -