Wednesday, July 16, 2025
E-PAPER
Homeఆదిలాబాద్అస్తవ్యస్తంగా విద్యా వ్యవస్థ..

అస్తవ్యస్తంగా విద్యా వ్యవస్థ..

- Advertisement -

సమయపాలన పాటించని కస్తూరిబా గాంధీ, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు..
గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం అందని భోజనం..
నవతెలంగాణ – కుభీర్:
కుభీర్ మండలంలో విద్య వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదు. వసతి గృహాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందడం లేదు. ఇందుకు నిదర్శనం మండల కేంద్రమైన కుభీర్ కస్తూరిబా గాంధీ , గిరిజన ఆశ్రమ పాఠశాల తో పాటు ప్రాథమిక పాఠశాలలే ఆదర్శంగా నిలుస్తున్నాయి. మంగళవారం గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు ఉదయం ఇడ్లీ, సాంబార్ అందించాలి కానీ డానికి బదులు కిచిడి పెట్టి చేతులు దులుపుకున్నారు. విద్యార్థులు కిచిడి రుచికరంగా లేకపోవడంతో ఇంటి నుంచి తెచ్చుకున్న ఊరగాయ తొక్కుతో కడుపు నింపుకున్నారు.

మరికొందరు అది తినలేక అన్నం పారేసి కడుపు మాడ్చుకున్నారు. ఉపాధ్యాయులు పాఠశాలకు సమయానికి హాజరు కాకపోవడంతో ఇద్దరు ఉపాధ్యాయులతో ప్రార్థన నిర్వహించారు. ప్రార్థన అనంతరం 20 నిమిషాలకు మిగతా ఉపాధ్యాయులు వచ్చారు. అలాగే కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో కూడా అదే పరిస్థితి నెలకొంది. ప్రార్థన సమయంలో నలుగురు  ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. ప్రార్థన అనంతరం మిగతా  ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చారు. అదేవిధంగా ప్రాథమిక పాఠశాలలో  ముగ్గురు  ఉపాధ్యాయులు ఉండగా ఒక్కరు కూడా సమయానికి రాలేదు.

దీంతో విద్యార్థులు పాఠశాల పరిసరాలలో ఆటలు ఆడుకుంటూ కాలక్షేపం చేశారు. మండల స్థాయి అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రతి విద్య సంవత్సరం ప్రారంభంలో విద్యా వ్యవస్థను గాడిలో పెడుతున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో విద్య వ్యవస్థ గాడి తప్పుతోందన్న ఆరోపణలు ఉన్నాయి ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి విద్యావ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యావేత్తలు, పిల్లల తల్లిదండ్రులు పలువురు  కోరుతున్నారు.

గిరిజన ఆశ్రమ పాఠశాలలో ప్రాథనోపాద్యురాలికి వివరాణ అడగగా ఉదయం వంట చేసే సమయంలో గ్యాస్ సిలెండర్ రిపేర్ కావడంతో విద్యార్థులకు ఇండ్లి సాంబార్ కు బదులు కిచిడి వండించాం. అనంతరం పాఠశాలను మండల విద్యాధికారి విజయ్ కుమార్ పాఠశాలకు తనిఖీ చేసి ఎలాంటి తప్పులు మళ్ళీ జరగకుండా చూడలని అధికారులకు సూచించారు. పౌలు రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రాథనొపద్యులు తిరుమల, వాణి శ్రీ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -