- Advertisement -
విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్..
నవతెలంగాణ – తిమ్మాజిపేట
ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థుల విద్యా ప్రమాణాలు అభివృద్ధికి ఉపాధ్యాయులు ప్రత్యేక బోధన అభ్యసనాలతో కృషి చేయాల్సిన అవసరం ఉందని నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ అన్నారు. సోమవారం నాగర్ కర్నూల్ మండల పరిధిలోని శ్రీపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను డిఇఓ రమేష్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థుల హాజరు ఉపాధ్యాయుల హాజరు రికార్డులను పరిశీలించి, విద్యా ప్రమాణాలను పరిశీలించారు. అనంతరం మధ్యాహ్న భోజనం నాణ్యతా ప్రమాణాలను పాటించాలని ఆదేశించారు. రోజువారి మెనూ ప్రకారం భోజనాన్ని అందిస్తూన్నారా లేదా అని డీఈఓ విద్యార్థులతో ఆరా తీశారు.
- Advertisement -