Tuesday, November 4, 2025
E-PAPER
Homeజిల్లాలువర్షాల ఎఫెక్ట్.. మొలకలెత్తిన వరిధాన్యం

వర్షాల ఎఫెక్ట్.. మొలకలెత్తిన వరిధాన్యం

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలంలోని సుద్దపల్లి గ్రామంలో సోమవారం కురిసిన వర్షానికి పూర్తిగా వరి ధాన్యం తడిసి ముద్దాయిందని, కుప్పల కింద రెండు రోజులుగా కురిసిన వర్షాలకు మొలకలు రావడం జరిగిందని రైతులు  తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని రూ.5.00 బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని రైతులు తెలిపారు. మొంథా తుఫాన్ ఎఫెక్ట్ రెండు మూడు రోజులు ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతులకు ఇప్పటికీ కోనుగోలు కేంద్రాల్లో సరైన సదుపాయాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే తార్ఫిన్ కవర్ లను రైతులకు అందించాలని వేడుకుంటున్నారు. ఆరుగాలం కష్టం చేసి పండించిన పంట తమ కండ్ల ఏదుటే తడిసిపోయిన ధాన్యం చూసి రైతులు కంటతడి పెడుతున్నారు. కుప్పల కింద రెండు రోజులుగా కురిసిన వర్షాలకు మొలకలు రావడం జరిగిందని, మమ్ములను ప్రభుత్వం, అధికారులు అందుకోవాలని రైతులు కోరుతున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -