Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్నైపుణ్యాలను వెలికి తీయడంలో ఫోటోగ్రాఫర్ల కృషి అభినందనీయం 

నైపుణ్యాలను వెలికి తీయడంలో ఫోటోగ్రాఫర్ల కృషి అభినందనీయం 

- Advertisement -

ఎమ్మెల్యే యశస్విని రెడ్డి 
నవతెలంగాణ – పాలకుర్తి
నైపుణ్యాలను వెలికితీయడంలో ఫోటోగ్రాఫర్ల కృషి అభినందనీయమని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. ఈనెల 19, 20, 21 తేదీలలో హైదరాబాదులో జరిగే ఫోటో ఎక్స్పో పోస్టర్ ను ఫోటోగ్రాఫర్లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ ఫోటో ఎక్స్పోలతో ఫోటోగ్రాఫర్లకు నైపుణ్యాలు పెరుగుతాయని, కాలానికి అనుగుణంగా నైపుణ్యాలను అందిపుచ్చుకోవచ్చని తెలిపారు.

నైపుణ్యాలను వెలికి తయడంలో ఫోటోగ్రాఫర్లు రాణించాలని సూచించారు. ఫోటోగ్రాఫర్లను ప్రభుత్వం ఆదుకునేందుకు ఫోటోగ్రాఫర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్, జిల్లా మాజీ కోఆప్షన్ సభ్యులు ఎండి మదర్, ఫోటోగ్రాఫర్ల సంఘం మండల అధ్యక్షుడు రాపోలు రాంబాబు, గౌరవ అధ్యక్షులు ఎడవల్లి వెంకన్న, ఉపాధ్యక్షులు గుడికందుల నరేష్,  సీనియర్ ఫోటోగ్రాఫర్లు బొమ్మగాని ప్రదీప్, వర్ధమాన్ శ్రీనివాస్, రమణ, సురేష్, శివ ప్రసాద్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad