Wednesday, February 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామాల్లో పెన్షన్ పంపిణీలో వృద్దులకు తప్పిన తిప్పలు 

గ్రామాల్లో పెన్షన్ పంపిణీలో వృద్దులకు తప్పిన తిప్పలు 

- Advertisement -

సర్పంచుల చొరవతో రెండు కౌంటర్ల ఏర్పాటు 
నవతెలంగాణ – దర్పల్లి 

ప్రతినెలా ప్రభుత్వం అందిస్తున్న పించిన్ కొరకు వృద్దులు పోస్టఫీస్ లవద్ద, పించిన్ కొరకు పడిగాపులు కాసేవారు. కొన్ని సందర్భాల్లో సర్వర్ రాక, మరికొన్ని సందర్భాల్లో పంపిణి అధికారుల నిర్లక్ష్యం, డబ్బులు అయిపోయాయని ఇలా అనేక ఇబ్బందులకు గురి అయ్యేవారు. పించిన్ దారుల సమస్యలు దృష్టిలో పెట్టుకొని ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో గెలుపు పొందిన దర్పల్లి సర్పంచ్ చెలిమేల శ్రీనివాస్, రామడుగు సర్పంచ్ రమేష్ గౌడ్ లు పించిన్ పంపినిపై దృష్టి సాధించి పోస్టల్ ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆయా గ్రామాల్లో అదనపు సెంటర్ల ద్వారా పించిన్ పంపిణికి అధికారులకు కోరగా స్పందించిన అధికారులు ఈరెండు గ్రామాల్లో ప్రత్యేకంగా మరో చోట పించిన్ పంపిణికి చేసేవిధంగా చొరవ తీసుకున్నారు.

దింతో ఆయా గ్రామాల్లో ప్రత్యేకంగా మరో కౌంటర్ ఏర్పాటు చేసి, ప్రత్యేకంగా మొదట రెండు రోజులు వారిద్దులకు పించిన్ పంపిణి అయ్యేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు. అతర్వాత బీడీ పించిన్ దారులకు అందిస్తున్నారు. సర్పంచుల చొరవతో వృద్దులకు ఇబ్బందులు లేకుండా పించిన్ పంపిణి జరగదాన్ని ఆయా గ్రామస్థులు హర్షం వెక్తం చేస్తున్నారు. ఇదిలావుండగా గ్రామాల్లో జరుగుతున్నా పించిన్ లో ఎలాంటి అవకతలు జరగకుండా ఎంపిడిఓ లక్ష్మారెడ్డి అక్కడక్కడా అలస్మిక తనిఖీలు చేస్తూ పించిన్ పంపిణి సజావుగా జరిగేవిధంగా చెర్యలు తీసుకుంటిన్నారు. కార్యక్రమంలో చేయూత పెన్షన్ మండల్ కోర్డినేటర్ రమేష్, పోస్ట్ మాన్ ప్రవీణ్, సర్పంచ్ రమేష్ గౌడ్, కారోబార్ మరియు పాలకవర్గం పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -