Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఉపరాష్ట్రపతి ఎంపిక పారదర్శకంగా జరగాలి 

ఉపరాష్ట్రపతి ఎంపిక పారదర్శకంగా జరగాలి 

- Advertisement -

బహుజన్  సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు టప్ప భానుచందర్ 
నవతెలంగాణ – చేగుంట

ఇన్ని రోజులు ఉపరాష్ట్రపతిగా దేశానికి సేవలందించిన జగదీప్ ధన్ ఖడ్ ను బీజేపీ బలవంతంగా రాజీనామా చేయించిందని బీఎస్పీ చేగుంట మండల అధ్యక్షుడు టప్ప భానుచందర్ ఆరోపించారు. ఉపరాష్ట్రపతి ఎంపిక ఏ పార్టీకి ఏ వ్యక్తులకు సంబంధం లేని రాజ్యాంగ పరిరక్షణకై పాటుపడి అపర మేధావికి మాత్రమే ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలని, రాష్ట్రపతి ఎంపిక పారదర్శకంగా జరగాలి తప్ప బీజేపీ అనుబంధ సంబంధ రాజకీయ పార్టీల వ్యక్తులకు ఇస్తే ఆ పదవికి ఆ ప్రతిష్ట అని ఆయన అన్నారు. సినిమా హీరో చిరంజీవికి పదవి ఇస్తారని ఊహాగానాలు వెలువడిన నేపథ్యంలో చిరంజీవి అనే వ్యక్తి నటన తప్ప రాజ్యాంగం పరంగా పెద్ద పదవులు ఇవ్వడానికి ఆయన అర్హుడు కాదని, సినిమా జీవితం తప్ప, ప్రజల బాగోగులు ఎలా తెలుస్తాయని అన్నారు. రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించే వ్యక్తులకు మాత్రమే ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలని ఆయనే సందర్భంగా డిమాండ్ చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad